Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: కొండంత స్కోరుతో డిక్లేర్.. ఆఫ్ఘన్‌కు భారత్ భారీ టార్గెట్!

IND vs AFG: ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. మ్యాచ్ రెండో రోజైన ఆదివారం(జూన్ 7) భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(126), కేఎల్ రాహుల్(100) అద్భుత సెంచరీలతో కదం తొక్కగా.. మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ చారిత్రాత్మక మ్యాచ్ ద్వారా భారత్ తరఫున యువ ఆటగాడు మానవ్ సుతార్ అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేయగా.. ఆఫ్ఘనిస్థాన్ జట్టు నుంచి నంగేయాలియా ఖరోటి కెరీర్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. మ్యాచ్ మొదటి రోజు నుంచే భారత బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడుతూ 165 బంతుల్లో 11 ఫోర్లతో తన టెస్ట్ కెరీర్‌లో 12వ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా 138 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన 11వ టెస్ట్ శతకాన్ని అందుకున్నాడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ 81 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ 24 పరుగులకే ఔటయ్యాడు.

IND vs AFG Test India Declare First Innings At 564 8 After Shubman Gill and KL Rahul Smashing Centuries

రెండో రోజు ఆటలో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 169 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఆఫ్ఘన్ బౌలర్ మహ్మద్ సలీమ్ సఫీ లంచ్ సమయానికి ముందే శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చాడు. గిల్ మొత్తం 177 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 126 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురేల్ (19) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. సెంచరీ దిశగా సాగుతున్న రిషబ్ పంత్ కూడా పెద్ద షాట్‌కు ప్రయత్నించి 81 పరుగుల వద్ద (6 ఫోర్లు, 3 సిక్సర్లు) క్యాచ్ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు.

చివర్లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీతో (52 నాటౌట్) మెరిశాడు. అరంగేట్ర ఆటగాడు మానవ్ సుతార్ 28 పరుగులు చేయగా.. మహ్మద్ సిరాజ్ 12 బంతుల్లోనే 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ అద్భుతమైన బౌలింగ్‌తో 6 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.

ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు టెస్ట్ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేదు. 2018 జూన్‌లో బెంగళూరు వేదికగా భారత్‌తోనే ఆఫ్ఘనిస్థాన్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 262 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇప్పటివరకు కేవలం 12 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఆఫ్ఘన్ జట్టు అందులో 4 మ్యాచ్‌ల్లో గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత్‌తో ఆ జట్టుకు ఇది రెండో టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం.

Story first published: Sunday, June 7, 2026, 14:11 [IST]
Other articles published on Jun 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+