రోహిత్ శర్మ ధమాకా ఇన్నింగ్: దీపావళికి ఊపొచ్చింది..ఊపేశాడు: థౌజండ్ వాలా సౌండ్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీమిండియా ఎట్టకేలకు బౌన్స్ బ్యాక్ అయింది. వరుసగా రెండు ఘోర పరాజయాల తరువాత.. తొలి విజయాన్ని అందుకుంది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా తాను ఎదుర్కొన్న మూడో మ్యాచ్‌లో బలహీనమైన ప్రత్యర్థిని ఓడించింది. మంగళవారం రాత్రి అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా ఏ జట్టూ చేయలేని 211 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఛేజింగ్‌కు దిగిన ఆఫ్ఘన్‌ను 144 పరుగుల వద్దే కట్టడి చేసింది.
సునామీ ఇన్నింగ్..
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. కసి తీరా ఆడారు. కరవు తీరేలా షాట్లను బాది అవతల పడేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల భరతం పట్టారు. మునుపటి ఫామ్‌ను అందుకున్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చిచ్చరపిడుగుల్లా ఆడారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 140 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 47 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, ఎనిమిది బౌండరీలు ఉన్నాయి. రోహిత్‌తో పోటీ పడి షాట్లు కొట్టాడు రాహుల్. 48 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 69 పరుగులు చేశాడు.
దీపావళి వచ్చిందంటే.. రోహిత్ చిచ్చరపిడుగే
అదేం విచిత్రమో గానీ.. దీపావళి పండగ నాడు రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ ట్రెడీషన్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతూ వస్తోంది. దాన్ని క్రమం తప్పకుండా సక్సెస్ చేస్తోన్నాడు హిట్‌మ్యాన్. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాడు. అబుధాబి స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు సినిమా చూపించాడు. 47 బంతుల్లో 74 పరుగులు చేశాడు. మూడు భారీ సిక్సర్లు, ఎనిమిది బౌండరీలను బాదాడు.

దీపావళి పండగ నాడే ఫస్ట్ డబుల్ సెంచరీ..
తన కేరీర్‌లో రోహిత్ శర్మ ఇప్పటిదాకా నాలుగు దీపావళి ఇన్నింగ్స్ ఆడాడు. అందులో ఒక్కటి మినహా.. మిగిలిన మూడు సూపర్ హిట్లే. దీపావళి పండగ నాడే అతను తన వన్డే ఇంటర్నేషనల్స్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో 209 పరుగులు చేశాడీ డాషింగ్ ఓపెనర్. 2016 నాటి దీపావళి పండగ సమయంలో న్యూజిలాండ్‌పై ఆడిన వన్డే ఇంటర్నేషనల్‌లో 70 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 269 పరుగులు చేయగా.. కివీస్ 79 పరుగులకే చాప చుట్టేసింది.

టీ20 ఫార్మట్‌లో సెంచరీ..
2018లో వెస్టిండీస్‌పై జరిగిన టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ బాదేశాడు. ఈ మ్యాచ్ కూడా దీపావళి నాడే జరిగింది. ఆ మ్యాచ్‌లో అతను మూడు ఒకట్ల స్కోర్ చేశాడు. రోహిత్ కేరీర్‌లో అది నాలుగో సెంచరీ. 2019లో ఈ ట్రెడీషన్ కంటిన్యూ అయింది. దక్షిణాఫ్రికాపై 212 పరుగులు చేశాడు. ఈ దీపావళికి ఆప్ఘనిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో జట్టు భారీ స్కోర్ చేయడానికి బాటలు వేశాడు. అబుధాబి మ్యాచ్‌లో టీమిండియా 210 పరుగులు చేయడానికి కారకుడయ్యాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. 144 పరుగులే చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications