
హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం పరుగు మాత్రమే చేసిన రోహిత్ పెవిలియన్ చేరాడు. దీంతో జట్టు స్కోరు 7 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఆప్ఘనిస్థాన్ తొలి ఓవర్‌ను స్పిన్‌తో ప్రారంభించింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ముజీబ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన హిట్‌మ్యాన్ క్లీన్ బౌల్డయ్యాడు.
10 బంతులు ఆడిన రోహిత్ శర్మ ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో భారీ సెంచరీ సాధించిన రోహిత్.. పసికూన ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విఫలం కావడంతో భారత అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి కోహ్లీ వచ్చాడు.
అఫ్తాబ్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన విరాట్ ఇన్నింగ్స్‌ను ఊపు తీసుకొచ్చాడు. కోహ్లీ, రాహుల్ భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. రాహుల్(22), కోహ్లీ(1526) పరుగులతో క్రీజులో ఉన్నారు.