న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

109 ఆలౌట్: ఆప్ఘనిస్థాన్ ఖాతాలో నమోదైన చెత్త రికార్డులివే

By Nageshwara Rao
IND Vs AFG, Day 2: Heres a list of teams batted the fewest overs in an innings of their inaugural Test

హైదరాబాద్: బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు పలు చెత్త రికార్డుల్ని మూటగట్టుకుంది. ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

అనంతరం శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ ఆడిన ఆప్ఘనిస్థాన్ భారత బౌలర్లు అశ్విన్ (4/27), జడేజా (2/18), ఇషాంత్ శర్మ (2/28) ధాటికి కేవలం 27.5 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా అరంగేట్రపు టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో అత్యంత తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగా అప్ఘనిస్థాన్ నిలిచింది.

బంగ్లా పేరిట ఉన్న చెత్త రికార్డుని సవరించిన ఆప్ఘన్

బంగ్లా పేరిట ఉన్న చెత్త రికార్డుని సవరించిన ఆప్ఘన్

ఈ క‍్రమంలో ఇప్పటి వరకూ బంగ్లాదేశ్‌ పేరిట ఉన్న ఈ చెత్త రికార్డును అప్ఘనిస్థాన్ సవరించింది. గతంలో బంగ్లాదేశ్‌ తన అరంగేట్రం మ్యాచ్‌లో భాగంగా ఒక ఇన్నింగ్స్‌లో 46.3 ఓవర్లు ఆడగా, తాజాగా ఆప్ఘనిస్థాన్ 28 ఓవర్లే బ్యాటింగ్ చేసింది. దీంతో పాటు అరంగేట్రం టెస్టులో ప్రత్యర్థికి భారీ ఆధిక్యం ఇచ్చిన జట్టుగా కూడా నిలిచింది.

 భారత్‌కు 365 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చిన ఆప్ఘన్

భారత్‌కు 365 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చిన ఆప్ఘన్

బెంగళూరు వేదికగా జరుగుతున్న టెస్టులో భారత్‌కి 365 పరుగుల ఆధిక్యాన్ని ఆప్ఘన్ ఇవ్వగా... 1928లో వెస్టిండీస్ జట్టు లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌కి ఇచ్చిన 224 పరుగుల ఆధిక్య రికార్డుని కనుమరుగయ్యేలా చేసింది. అంతేకాదు టెస్టుల్లో చిన్నస్వామి స్టేడియంలో అత్యల్ప స్కోరు చేసిన టెస్టు జట్టుగా ఆప్ఘనిస్థాన్ నిలిచింది.

ఆసీస్ రికార్డుని చెరిపేసిన ఆప్ఘన్

ఆసీస్ రికార్డుని చెరిపేసిన ఆప్ఘన్

ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టు 2017లో భారత్‌పై చేసిన 112 పరుగులు ప్రదర్శననే చెత్త రికార్డు. తాజాగా 109 పరుగులతో ఆ రికార్డుని ఆప్ఘనిస్థాన్ చెరిపివేసింది.

అరంగేట్ర టెస్టుల్లో అత్యల్ప స్కోర్లు చేసిన జట్లు:

అరంగేట్ర టెస్టుల్లో అత్యల్ప స్కోర్లు చేసిన జట్లు:

* Afghanistan (1st innings) in 27.5 overs.

* Bangladesh (2nd innings) in 46.3 overs.

* NZ (1st innings) in 47.1 overs.

* Ireland (1st innings) in 47.2 overs.

* Pakistan (2nd innings) in 58.2 overs.

* India (2nd innings) in 59.3 overs.

* NZ (2nd innings) in 60.3 overs.

* England (2nd innings) in 66.1 overs.

* Australia (2nd innings) in 68.0 overs.

Story first published: Saturday, June 16, 2018, 13:26 [IST]
Other articles published on Jun 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X