Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: రోహిత్-కోహ్లిని అతనే ఔట్ చేస్తాడు- డేల్ స్టెయిన్

టీమిండియా సూపర్ సమరానికి సిద్ధమైంది. సూపర్-8లో భాగంగా బార్బడోస్ వేదికగా ఇవాళ అఫ్గానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. రికార్డులు, ఫామ్ పరంగా రోహిత్ సేననే ఈ మ్యాచ్‌లో ఫేవరేటు అయినప్పటికీ అఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. టీ20ల్లో సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా అఫ్గానిస్థాన్ నిలుస్తూ ఉంటుంది.

అయితే భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ పోరులో సత్తాచాటే నలుగురు ఆటగాళ్లను ఎంచుకుని వారి గురించి మాట్లాడాడు. భారత్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్ట్ చేశాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అని స్టెయిన్ కొనియాడాడు. టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్లలో గొప్ప ప్లేయర్ అని అన్నాడు.

IND vs AFG Dale Steyn Warns Kohli and Rohit Farooqi Can Knock Your Pegs Up

అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సత్తాచాటుతాడని డేల్ స్టెయిన్ జోస్యం చెప్పాడు. ఇవాళ అతని చక్కని ప్రదర్శనను చూడనున్నామని చెప్పాడు. అలాగే అఫ్గానిస్థాన్ ప్లేయర్లు ఫజల్లా ఫరూకీ, రహ్మనుల్లా గుర్బాజ్ ఇవాళ పోరులో రాణిస్తారని స్టెయిన్ అన్నాడు. అంతేగాక ఫజల్లా ఫరూకీతో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాలని, స్టార్ క్రికెటర్లు వికెట్లు ఫరూకీ తీయగలడని పేర్కొన్నాడు.

ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఫజల్లా ఫరూకీ టీ20 వరల్డ్ కప్-2024 లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఏకంగా 12 వికెట్లు సాధించాడు. 86 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ యువ పేసర్‌ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాలని విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు స్టెయిన్ సూచించాడు. లీగ్ స్టేజ్‌లో కోహ్లి నిరాశపరిచిన విషయం తెలిసిందే. 1, 4, 0తో పేలవమైన ప్రదర్శన చేశాడు.

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా/కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌, బుమ్రా.

అఫ్గానిస్థాన్‌: రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా, నజీబుల్లా, నబి, కరీమ్‌ జనత్, రషీద్‌ ఖాన్‌ (కెప్టెన్‌), నూర్‌ అహ్మద్, నవీనుల్, ఫజల్లా ఫరూఖీ.

Story first published: Thursday, June 20, 2024, 15:24 [IST]
Other articles published on Jun 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+