IND vs AFG : టాస్ గోవిందా..! అందుకే రోహిత్ శర్మ తప్పుకున్నాడు, కెప్టెన్‌గా రాహుల్, మూడు మార్పులతో టీమిండియా

వరుసగా రెండు విజయాలతో ఆసియాకప్ గ్రూప్ దశలో టాప్‌లో నిలిచిన భారత జట్టు.. సూపర్ 4లో మాత్రం చతికిలపడిపోయింది. పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓటమితో టోర్నీ ఫైనల్ ఆశలను ఆవిరి చేసుకుంది. సూపర్ 4లో ఇవ్వాళ భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది. పటిష్ఠ ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొనబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7:30గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.
ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలగడంతో ఈ మ్యాచ్ ఫైనల్ అవకాశాలను ప్రభావితం చేయదు. కానీ.. దుర్భేద్యమైన ఆఫ్ఘనిస్థాన్ టీంను ప్రస్తుత టీమిండియా ఎదుర్కోవడం మాత్రం కత్తి మీద సామే.. నిన్న పాకిస్థాన్‌ను ఓడించినంత పని చేసిన ఆఫ్ఘన్.. గ్రూప్ దశలో రెండు మ్యాచ్‌లు గెలిచి టాప్ పొజిషన్ ద్వారా సూపర్ 4లోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా స్ట్రాంగ్‌గా ఆఫ్ఘన్ కన్పిస్తుంది. ఇక ఇరు జట్లు పరువు కోసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని తాపత్రాయపడుతున్నాయి.

భారీ ప్రయోగంతో..
సూపర్ 4 దశలో తొలి రెండు మ్యాచ్‌లల్లో చేసిన ప్రయోగాలు భారత్‌కు బెడిసికొట్టాయి. అయినా ఈ మ్యాచ్ విషయంలో మళ్లీ భారీ ప్రయోగం జరిగింది. కెప్టెన్ రోహిత్‌కు టీం మేనేజ్ మెంట్ రెస్ట్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ఇక ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ నబీ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ టాస్ ఓడిపోవడంతో మ్యాచ్ గోవిందా అనే డౌట్ వస్తుంది. దుబాయ్ స్టేడియంలో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే అన్నట్లు మ్యాచ్‌ల రిజల్ట్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఆడడం కష్టం
ఇక టాస్ ఓడిన కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. మేము బ్యాటింగ్ యూనిట్‌గా మమ్మల్ని మేం సవాలు చేయాలనుకుంటున్నాం. రోహిత్ విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఈ పరిస్థితుల్లో బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఆడటం అంత సులభం కాదు. అందుకే రోహిత్‌కు రెస్ట్. చాహల్, రోహిత్, హార్దిక్ కూడా జట్టు నుంచి తప్పుకున్నారు. దీపక్ చాహర్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్ వారి స్థానంలో జట్టులోకి వచ్చారు. మేము టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆసియా కప్‌కు వచ్చాం. ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి టోర్నీ ఆడడంతో మాకు చాలా విషయాలు నేర్చుకునే వీలు దక్కింది.' అని రాహుల్ అన్నాడు.

తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఎఫ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications