న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంజమామ్‌ రికార్డుకు అడుగుదూరంలో నిలిచిన కోహ్లీ

Ind v WI: Can Kohli Break Inzamams Record at Hyderabad?

న్యూ ఢిల్లీ: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టులో సెంచరీ బాదిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్‌ ఉల్ హక్‌ రికార్డుకి అడుగు దూరంలో నిలిచాడు. విరాట్ కోహ్లి మళ్లీ శతకాల వేట మొదలెట్టాడు. ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్‌ తర్వాత ఆసియా కప్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నా.. మళ్లీ ఆడిన తొలి మ్యాచ్‌లోనే 230 బంతుల్లో 10ఫోర్ల సాయంతో 139 పరుగులు చేసిన కోహ్లి కెరీర్‌లో 24వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఇంజిమామ్ కెరీర్‌లో 25 సెంచరీలు

ఇంజిమామ్ కెరీర్‌లో 25 సెంచరీలు

పాకిస్థాన్ జట్టుకి దాదాపు 15 ఏళ్లు ప్రాతినిథ్యం వహించిన ఇంజిమామ్ ఉల్ హక్ కెరీర్‌లో 120 టెస్టులాడి 25 సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లీ కేవలం 72 టెస్టుల్లోనే 24 సెంచరీలతో అతడ్ని సమీపించాడు. వెస్టిండీస్‌తో శుక్రవారం నుంచి హైదరాబాద్‌ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. తనకి బాగా కలిసొచ్చిన ఉప్పల్ మైదానంలో మరో సెంచరీ బాది ఇంజిమామ్ రికార్డుని అందుకోవాలని కోహ్లి ఆశిస్తున్నాడు.

ఇప్పటికే సెహ్వాగ్‌ను దాటేసి:

ఇప్పటికే సెహ్వాగ్‌ను దాటేసి:

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 24 సెంచరీతో కోహ్లి ప్రస్తుతం 21వ స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్‌ (36), సునీల్‌ గవాస్కర్‌ (34)లు కోహ్లి కన్నా ముందు ఉన్నారు. ఇక సెహ్వాగ్‌ 23 సెంచరీలతో కోహ్లి తర్వాతి స్థానంలో నిలిచాడు. 72 టెస్టుల్లో కోహ్లి 24 సెంచరీలు సాధించగా 103 టెస్టుల్లో సెహ్వాగ్‌ 23 సెంచరీలు పూర్తి చేశాడు.

 కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో

కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో

అత్యధిక సార్లు ఫాలోఆన్‌ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ ప్రత్యర్థి జట్టును కోహ్లీ ఐదు సార్లు ఫాలోఆన్‌కు ఆహ్వానించగా, మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ ఏడుసార్లు ఫాలో ఆన్‌ ఆడించాడు. దాంతో ఎక్కువ సార్లు ఫాలోఆన్‌ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.

వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలో కోహ్లీ

వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలో కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాలు వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 884 పాయింట్లతో బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 797 పాయింట్లతో బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Story first published: Wednesday, October 10, 2018, 16:28 [IST]
Other articles published on Oct 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X