Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Playing 11 vs SCO: కలిసొచ్చిన మార్పులు.. స్కాట్లాండ్‌పైనా భారీ విజయం దక్కేనా? భారత తుది జట్టు ఇదే!!

IND Playing 11 vs SCO: Surya Kumar Yadav and Ravichandran Ashwin to play Scotland match

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్ 12లో రెండు వరుస పరాజయాలను ఎదుర్కొన్న భారత్.. ఎట్టకేలకు సూపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లపై దారుణ ఓటముల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించింది. బాటర్లు, బౌలర్లు సత్తాచాటడంతో టీమిండియా భారీ విజయం సాధించింది. ఈ మ్యాచులో భారీ తేడాతో గెలవడంతో టీమిండియా తమ సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇక టీమిండియాకు గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచులు ఉన్నాయి. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. ఈ రెండు మ్యాచుల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంది. ముందుగా శుక్రవారం (అక్టోబర్ 5) స్కాట్లాండ్ జట్టుతో జరిగే మ్యాచులో భారత్ విజయాన్ని అందుకోవాలి. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.

ఓపెనింగ్ అదుర్స్:

ఓపెనింగ్ అదుర్స్:

ఆఫ్ఘనిస్తాన్‌పై రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారు. ఇషాన్ కిషన్‌ను తప్పించడం కలిసొచ్చింది. రోహిత్-రాహుల్ జోడి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో ఈ ఇద్దరు మరోసారి చెలరేగాలని భారత మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గత మ్యాచులో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగలేదు. ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందించడంతో కోహ్లీ యువకులకు అవకాశం ఇచ్చాడు. అయితే కోహ్లీ మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి రావడం టీమిండియాకు కలిసిరానుంది. ఎందుకంటే అతడు స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొగలడు. సమయానుసారంగా బ్యాట్ జులిపించగలడు.

ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే:

ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే:

గత మ్యాచులో చేసిన ప్రయోగాలన్నీ టీమిండియాకు కలిసివచ్చాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు బ్యాట్లతో చెలరేగారు. భారీ షాట్లతో అలరించారు. వారి ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే టీమిండియాకు తిరుగుండదు. ఆఖర్లో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్ రౌండర్లు ఉండటం టీమిండియాకు ప్లస్ పాయింట్. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడడంతో.. రవిచంద్రన్ అశ్విన్‌ను విస్మరిస్తుండడంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో గత మ్యాచులో అతన్ని జట్టులోకి తీసుకువచ్చింది టీమిండియా. ఈ మార్పు టీమిండియాకు మంచి చేసిందనే చెప్పాలి. అశ్విన్ రెండు వికెట్లతో సత్తాచాటాడు. ఇక ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలపై బౌలింగ్ భారం ఉంది. అఫ్గానిస్థాన్‌తో తలపడిన జట్టునే టీమిండియా స్కాట్లాండ్ మీద కొనసాగించవచ్చు.

ప్లస్‌లోకి టీమిండియా రన్ రేట్:

ప్లస్‌లోకి టీమిండియా రన్ రేట్:

అఫ్గానిస్థాన్‌పై భారీ విజయం సాధించడంతో ప్రస్తుతం టీమిండియా రన్ రేట్ ప్లస్‌లోకి వచ్చింది. - 1.609 నుంచి +0.073కి టీమిండియా నెట్ రన్ రేట్ పెరిగింది. మరోవైపు అఫ్గానిస్థాన్ నెట్ రన్ రేట్ +3.097 నుంచి +1.481కి తగ్గింది. మరోవైపు న్యూజిలాండ్ రన్ రేట్ +0.816గా ఉంది. సెమీస్ మీద ఆశలు ఉంచుకోవాలంటే స్కాట్లాండ్ జట్టును టీమిండియా చిత్తుగా ఓడించాల్సిందే. అలా అయితేనే అఫ్గానిస్థాన్ కంటే మెరుగైన రన్ రేట్ మనకు వస్తుంది.

 భారత తుది జట్టు (అంచనా) :

భారత తుది జట్టు (అంచనా) :

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా.

Story first published: Thursday, November 4, 2021, 21:11 [IST]
Other articles published on Nov 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+