IND vs SCO: స్టార్ ఆటగాడికి షాకివ్వనున్న విరాట్ కోహ్లీ.. స్కాట్లాండ్‌తో బరిలోకి దిగనున్న భారత జట్టు ఇదే!!

దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో రెండు వరుస పరాజయాలను ఎదుర్కొన్న భారత్.. ఎట్టకేలకు సూపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లపై దారుణ ఓటముల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై కోహ్లీసేన విజయం సాధించింది. బాటర్లు, బౌలర్లు సత్తాచాటడంతో టీమిండియా భారీ విజయం సాధించింది. ఈ మ్యాచులో భారీ తేడాతో గెలవడంతో టీమిండియా తమ సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇక టీమిండియాకు గ్రూప్ స్టేజీలో మరో రెండు మ్యాచులు ఉన్నాయి.
సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. ఈ రెండు మ్యాచుల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంది. ముందుగా మరికొద్ది సేపట్లో స్కాట్లాండ్ జట్టుతో ఆరంభం అయ్యే మ్యాచులో భారత్ భారీ విజయం సాధించాల్సి ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడానికి ఓ కఠినమైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

ఠాకూర్‌కు షాక్ తగలనుంది
సాధారణంగా ఏ జట్టు కెప్టెన్లు అయినా విన్నింగ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయడానికి అసలు ఇష్టపడరు. కానీ భారత సారథి విరాట్ కోహ్లీ మాత్రం అలా చేయగలడనడంలో ఎలాంటి సందేహం లేదు. స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ఓ భారీ మార్పు చేయనుందని సమాచారం.
పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది. ఠాకూర్ స్థానంలో అదనపు స్పిన్నర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. అందుకు కారణం లేకపోలేదు. స్కాట్లాండ్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో కాస్త బలహీనంగా ఉంటారు. అందుకే రాహుల్ చహర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఖరీదైన బౌలర్‌గా ఠాకూర్
ముందుగా విఫలమయిన భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో అవకాశం ఇచ్చారు. అయితే ఠాకూర్ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌పై 9 బంతుల్లో 17 పరుగులు, చేయగా.. ఆఫ్ఘనిస్తాన్‌పై 3 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఠాకూర్ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాదారు.
ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌పై ఠాకూర్ ఖరీదైన బౌలర్‌గా మారాడు. అతడు పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే.. భారత్ గెలుపు మార్జిన్ పెద్దదిగా ఉండేది. పాయింట్ల పట్టికలో మెరుగైన నెట్ రన్ రేట్‌ను సాధించగలిగేది. కానీ అలా జరగలేదు.

అదనపు స్పిన్నర్‌కు అవకాశం
స్కాట్లాండ్ జట్టుతో జరిగే మ్యాచులో శార్దూల్ ఠాకూర్ స్థానంలో అదనపు స్పిన్నర్‌కు అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఐపీఎల్ స్టార్ రాహుల్ చహర్‌కు తొలిసారి అవకాశం రావొచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. గూగ్లీ, ఫ్లిప్పర్‌లతో చహర్ స్కాట్లాండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేస్తున్నాడు. దాంతో మూడో పేసర్ రూపంలో అతడు జట్టుకు ఉపయోగపడనున్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ రాకతో స్పిన్ బౌలింగ్ బలం పెరిగింది. అతడికి తోడుగా చహర్‌ను కూడా జట్టులో తీసుకోనుంది భారత్. మరి కెప్టెన్ విరాట్ ఎవరికి ఓటేస్తాడో చూడాలి.

తుది జట్టు (అంచనా)
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications