ఈడెన్ గార్డెన్స్‌లో రెండో టెస్టు: కపిల్‌కు అరుదైన గౌరవం
కోల్‌కత్తా: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు అరుదైన గౌరవం లభించనుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తరహాలో కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అమర్చిన గంటను ముందుగా కొట్టే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈ మేరకు కపిల్‌కు ఆహ్వానం పంపినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) స్పష్టం చేసింది.

రెండో టెస్టు ప్రారంభం
గంట కొట్టిన తర్వాతే రెండో టెస్టు ప్రారంభం
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు టెస్టుల సిరిస్‌లో భాగంగా ఈనెల 30వ తేదీన జరగనున్న రెండో టెస్టును గంట కొట్టిన తర్వాత ఆరంభించనున్నట్లు క్యాబ్ జాయింట్ సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు. ఈ సందర్భంగా అవిషేక్ దాల్మియా మాట్లాడుతూ..

గంగూలీ ఆలోచన
'ఇలా కపిల్ దేవ్‌తో గంటను కొట్టించాలనేది క్యాబ్ అధ్యక్షుడు గంగూలీ ఆలోచన. ఈ విషయాన్ని తెలుపుతూ కపిల్‌కు ఆహ్వానం కూడా పంపాం. అందుకు ఆయన అంగీకరించారు' అని అవిషేక్ దాల్మియా ప్రకటించారు. 2007లో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో గంట కొట్టిన తరువాత టెస్ట్ మ్యాచ్‌ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.

మాజీ క్రికెటర్లతో గంట కొట్టిస్తారు
అదే మాదిరి ఈడెన్ గార్డెన్స్‌లో టెస్ట్ మ్యాచ్ జరిగనన్నీ రోజులూ రెండు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు గంట కొట్టి మ్యాచ్‌ని ఆరంభిస్తారు. దీనికి సంబంధించి పెవిలియన్‌కు వెలుపల ఉండే బౌలర్ల బార్‌లో గంట వేలాడదీశారు. ఈ గంటను ఐదు నిమిషాల పాటు మోగించనున్నారు.

టాస్ కోసం ప్రత్యేకంగా బంగారు నాణెం
ఇదిలా కోల్‌కత్తాలో జరగబోయే ఈ టెస్టు మ్యాచ్ భారత్‌లో 250వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లకు 100 గ్రాముల బరువున్న సిల్వర్ నాణెలతో క్యాబ్ సన్మానించనుంది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో టాస్ వేసేందుకు ప్రత్యేకంగా బంగారు నాణేన్ని తయారు చేయించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications