Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: అంపైర్‌తో కెప్టెన్ గొడవ.. మధ్యలో దూరి వైభవ్ ఏం చేశాడో చూస్తే షాకవుతారు!

IND vs SL: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సోమవారం ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పూర్తిగా రెండు విభిన్నమైన రూపాల్లో కనిపించాడు. ఓ వైపు అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన కెప్టెన్ తిలక్ వర్మ ఆగ్రహాన్ని చల్లార్చిన వైభవ్.. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో ఘర్షణకు దిగాడు. ఈ మొత్తం సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వివాదం వాస్తవానికి మ్యాచ్ చివరి బంతితో మొదలైంది. శ్రీలంక 'ఎ' గెలవడానికి ఒక పరుగు అవసరం కాగా.. బంతి బ్యాటర్ ప్యాడ్‌కు తగిలింది, దాంతో అంపైర్ దానిని లెగ్-బైగా ప్రకటించాడు. బ్యాటర్ షాట్ ఆడటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని, కాబట్టి ఆ పరుగు చెల్లదని టీమిండియా వాదించింది. ఈ పరుగు కారణంగా మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత మసక వెలుతురులో సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిర్ణయం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసి, మైదానంలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది.

IND A vs SL A 15-Year-Old Vaibhav Sooryavanshi Restrains Tilak Varma in Heated Umpire Clash Video Viral

తిలక్‌ను శాంతపరిచిన వైభవ్ సూర్యవంశీ
తక్కువ వెలుతురులో సూపర్ ఓవర్ నిర్వహించాలనే అంపైర్ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ తిలక్ వర్మ.. బౌండరీ లైన్ వద్ద అంపైర్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. పరిస్థితి చేయిదాటిపోవడాన్ని గమనించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. వాగ్వాదం మరింత ముదరకుండా, సూపర్ ఓవర్ ప్రారంభమయ్యేలా చేయడానికి, అతను తన కెప్టెన్‌ను అంపైర్ నుంచి పక్కకు నెట్టి జోక్యం చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ చర్యకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

సూపర్ ఓవర్ తర్వాత మారిన దృశ్యం
అయితే కేవలం కొన్ని నిమిషాల తర్వాత, కథ పూర్తిగా మలుపు తిరిగింది. భారత జట్టు సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. వైభవ్ సూర్యవంశీ క్రీజ్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నిరాశతో పెవిలియన్‌కు తిరిగి వెళుతుండగా, శ్రీలంక 'ఎ' ఆటగాళ్లు అతన్ని స్లెడ్జింగ్ చేశారు. దీంతో ఆగ్రహించిన యువ సూర్యవంశీకి కోపం వచ్చి ప్రత్యర్థి ఆటగాళ్లపైకి దూసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ముందు కెప్టెన్‌ను శాంతపరిచిన వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

Story first published: Tuesday, June 16, 2026, 9:53 [IST]
Other articles published on Jun 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+