మళ్లీ వివాదంలో వైభవ్ సూర్యవంశీ.. అంపైరింగ్‌పై దుమారం!
IND A vs AFG A: శ్రీలంక వేదికగా జరుగుతున్న టోర్నీలో భాగంగా ఇండియా ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదటి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత ఇన్నింగ్స్ ను ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ ప్రారంభించారు. గత మ్యాచ్‌ల్లో వివాదాలతో వార్తల్లో నిలిచిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో లభించిన లైఫ్‌ను ఉపయోగించుకుని కాసేపు క్రీజులో నిలిచాడు. అయితే 38 పరుగులు (28 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన తర్వాత వైభవ్ పెవిలియన్ చేరాడు.
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓ కష్టమైన క్యాచ్‌ను ఆఫ్ఘన్ ఫీల్డర్ అందుకున్నప్పటికీ.. రీప్లేలో బంతి మైదానంలోని గడ్డిని తాకినట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ దానిని 'నాటౌట్'గా ప్రకటించాడు. ఆ తర్వాత మరోసారి ఆఫ్ఘన్ ఫీల్డర్లు వైభవ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను చేజార్చారు. ఇలా రెండు లైఫ్‌లు లభించిన తర్వాత వైభవ్ క్రీజులో కుదురుకుంటాడని భావించినా.. చివరకు 38 పరుగుల వద్ద షార్ట్ పిచ్ బంతిని పుల్ చేయబోయి క్లీన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

భారత ఇన్నింగ్స్ 7.6 ఓవర్ల వద్ద ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరీదూన్ దావుద్‌జాయ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ చేయడానికి వైభవ్ ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ పైభాగానికి తగిలి గాల్లోకి లేవగా, పాయింట్ స్థానంలో ఉన్న ఖలీద్ తానివాల్ అద్భుతమైన క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో భారత్ 74 పరుగుల వద్ద తన మొదటి వికెట్‌ను కోల్పోయింది. 135.71 స్ట్రైక్ రేట్‌తో ఆడినప్పటికీ వైభవ్ ఇన్నింగ్స్ జట్టుకు పెద్ద స్కోరుగా మారలేకపోయింది.
క్యాచ్‌పై రచ్చ.. అంపైర్లతో ఆఫ్ఘన్ ఫైట్!
ఇన్నింగ్స్ ప్రారంభంలో వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ను అంపైర్లు నాటౌట్ గా ప్రకటించడంతో హై-వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. అంపైర్ ఇచ్చినవివాదాస్పద నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు మైదానంలోనే అంపైర్లతో వాగ్వాదానికి దిగారు.ఈ వివాదం భారత ఇన్నింగ్స్ 1.3 ఓవర్ వద్ద చోటుచేసుకుంది. ఆఫ్ఘన్ బౌలర్ షమ్స్ ఉర్ రెహమాన్ వేసిన బంతిని వైభవ్ సూర్యవంశీ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫరీదూన్ తన ఎడమ వైపునకు అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అత్యంత కష్టమైన క్యాచ్‌ను అందుకున్నాడు. మైదానంలో ఉన్నవారందరూ అది క్లీన్ క్యాచ్ అని భావించినప్పటికీ.. ఫీల్డ్ అంపైర్లు దీనిని నిర్ధారించుకోవడానికి థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. అయిత, రీప్లేలో ఫీల్డర్ కింద పడే సమయంలో బంతి కొంత భాగం మైదానంలోని గడ్డిని తాకినట్లు కనిపించింది. దీనిని ఆధారంగా చేసుకుని థర్డ్ అంపైర్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా 'నాటౌట్' అని ప్రకటించడంతో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అంపైర్లతో ఘర్షణకు దిగారు.
ఈ ట్రై-సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కూడా వైభవ్‌కు, శ్రీలంక ఆటగాళ్లకు మధ్య మైదానంలో తీవ్రమైన వాగ్వాదం, గొడవ జరిగింది. ఆ మ్యాచ్‌లో కూడా మైదానంలో వాతావరణం చాలా వేడెక్కింది. ఇప్పుడు వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా వైభవ్ క్రీజులో ఉన్నప్పుడే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు అంపైర్లతో గొడవకు దిగడం గమనార్హం.
దంబుల్లాలోని రంగిరి ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరుగుతున్న ఈ మ్యాచ్ భారత జట్టుకు అత్యంత కీలకంగా మారింది. ఈ త్రైపాక్షిక సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఇప్పటికే రెండింటిలో భారత్ ఓడిపోయింది. దీంతో ఫైనల్ రేసులో నిలవాలంటే ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించడం భారత 'ఎ' జట్టుకు అనివార్యంగా మారింది. మరోవైపు, గత మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లతో గొడవ పడిన వైభవ్ సూర్యవంశీ వైఖరిపై కోచ్‌లు, క్రికెట్ వర్గాల నుంచి తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications