కోహ్లీని 'క్రికెట్'లో రొనాల్డోతో పోల్చిన మాజీ కెప్టెన్
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డోతో పోల్చాడు. 351 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 63 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడిన తరుణంలో కోహ్లీ 122, కేదార్ జాదవ్ 120 సెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.
దీంతో 2016లో మూడు ఫార్మెట్లలో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ ఈ ఏడాదిని కెప్టెన్‌గా విజయంతో ఆరంభించడాన్ని పలువురు మాజీలు ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో టీమిండియాని నెంబర్ వన్‌గా నిలబెట్టిన కోహ్లీ వన్డేల్లో కూడా ఆ దిశగా సాగుతున్నాడు.
పరిమత ఓవర్ల కెప్టెన్‌గా ధోని నుంచి సారధ్య బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ టెస్టుల్లో మాదిరే పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి వన్డేలో విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు టీమిండియాకు సంచలన విజయాన్నందించిన కోహ్లీ తన కెరీర్‌లో 27వ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరి ఆటపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ధోని నుంచి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి వన్డేలో సంచలన విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ బీసీసీఐ వెబ్‌సైట్‌కి ఇంటర్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్యూలో కోహ్లీని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ పలు ఆసక్తికర విషయాలు అడిగారు.
ఈ సందర్భంగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ కోహ్లిని క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డోతో పోల్చాడు. 'వీడియో ఆన్ డిమాండ్' యుగంలో కోహ్లి డిమాండ్‌పై సెంచరీలు సాధిస్తున్నాడని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కితాబిచ్చాడు. వీరితో పాటు సంజయ్ మంజ్రేకర్, అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ, ఆకాశ్ చోప్రా కోహ్లీ-జాదవ్ జోడీలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సచిన్ టెండూల్కర్
ఈ ఏడాదిని టీమిండియా విజయంతో ఆరంభించడంపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది భారత జైత్రయాత్రకు తొలి అడుగు అని కొనియాడాడు.
వీవీఎస లక్ష్మణ్
ఒత్తిడిలో కూడా కేదార్ జాదవ్ అద్భుతంగా ఆడాడు. చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నందుకు టీమిండియాకు అభినందనలు. కోహ్లీ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారని లక్ష్మణ్ కొనియాడాడు.
ఇర్ఫాన్ పఠాన్
63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా అద్భుతమైన ఛేజింగ్ చేసిందంటూ మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు.
మహ్మద్ కైఫ్
తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై సంచలన విజయం సాధించిన టీమిండియాకు మహ్మద్ కైఫ్ అభినందనలు తెలిపాడు. కేదార్ జాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
హర్షా భోగ్లే
ఇండియా అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా 350 పరుగుల రన్ ఛేజింగ్లో ఇండియా బ్యాటింగ్ సత్తా ఏంటో తెలిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications