కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ శర్మ అద్భుతం చేశాడు. అతను 21 బంతుల్లో 5 వికెట్లు తీశాడు.
తొలుత భారత్ 351 పరుగులకు ఆలౌట్ అయింది. గురువారం నాడు 109 పరుగులతో నాటౌట్‌గా ఉన్న రహానే శుక్రవారం బ్యాటింగ్‌కు దిగలేదు. అనంతరం, తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బోర్డ్ టీమ్‌ను ఇషాంత్ శర్మ తుత్తునియలు చేశాడు.

కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇషాంత్ బౌలింగ్ వాడికి శ్రీలంక బోర్డ్ జట్టులోని టాప్ 6 బ్యాట్స్‌మెన్లలో ఐదుగురు పెవిలియన్ చేరారు. ఇందులో నలుగురు డకౌట్ అయ్యారు. శ్రీలంక బోర్డ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 121 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇండియాకు 230 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్‌ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ప్రారంభించారు. వీరిద్దరూ నిరాశపరిచారు. రోహిత్ 8 పరుగులకు, కోహ్లీ 18 పరుగులకు అవుటయ్యారు. వన్ డౌన్‌లో వచ్చిన సాహా ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. దీంతో 28 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది.