నాలుగో వన్డే మ్యాచ్ హైలెట్స్: గాల్లో నిల్చొని క్యాచ్ అందుకున్న మార్‌క్రమ్
![Incredible flying catch from Aiden Markram in “pink day” ODI [video] Incredible flying catch from Aiden Markram in “pink day” ODI [video]](https://images.mykhel.com/te/img/2018/02/match-1518334388.jpg)
హైదరాబాద్: జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరు అనుక్షణం ఊహకందని రీతిలో కొనసాగింది. ఈ జట్టులో భారత్ ఐదు వికెట్లో తేడాతో ఓడిపోయింది. ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శన మాత్రం అంతకుమించిన స్థాయిలో ఆకట్టుకున్నాయి.
ఎగిరి క్యాచ్ అందుకున్న మార్‌క్రమ్:
రబాడ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య ఎక్స్‌ట్ర్ కవర్ మీదుగా షాట్ ఆడాడు. మామూలుగా అయితే బంతి ఫీల్డర్‌ను దాటి బౌండరీకి వెళ్లేదే. కానీ మర్కరమ్ అద్భుతం చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో కష్ట సాధ్యమైన క్యాచ్‌ను అందుకున్నాడు. నమ్మలేని రీతిలో మర్కరమ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో పాండ్య నిష్క్రమించాడు. అత్యద్భుత రీతిలో బంతిని అందుకున్న సఫారీ ఫీల్డర్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ధావన్ వందో వన్డే వంద పరుగులు:
వందో వన్డే ఆడుతూ సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా ధావన్ రికార్డు సృష్టించాడు. శనివారం నాటి మ్యాచ్ అతడికి వందో వన్డే. ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన శిఖర్.. వందకు పైగా స్ట్రైక్ రేట్‌తో సెంచరీ పూర్తి చేశాడు. నాలుగో వన్డేలో కేవలం 99 బంతులకే ధావన్ సెంచరీని పూర్తి చేశాడు. బంతిని 10 ఫోర్లు, 2 సిక్సులతో బౌండరీలకు పరిగెత్తించాడు.
ఎంగిడి బౌలింగ్‌లో కోహ్లీ సిక్స్:
ఎంగిడి ఊహించని రీతిలో:
లుంగీ ఎన్గిడి బౌలింగ్‌లో కోహ్లి బాదిన సిక్స్ హైలెట్‌గా నిలిచింది. లుంగీ విసిరిన గుడ్ లెంగ్త్ బంతిని అతడి తల మీదుగా కోహ్లి సిక్స్‌గా మలిచాడు. ఈ షాట్ వీక్షకుల్ని ఫిదా చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications