Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India: ఏడాది పూర్తయింది.. ఏ ఫార్మాట్‌లో భారత్ ఎలా ఆడింది?

in which format team india performed best in 2022

ఈ ఏడాదిలో భారత జట్టు తమ చివరి క్రికెట్ మ్యాచ్ ఆడేసింది. ఢాకాలోని షేర్ ఎ బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో పోరాడి గెలిచింది. దీంతో 2022లో తమ క్యాంపెయిన్‌ను విజయంతో ముగించినట్లయింది. అయితే ఈ ఏడాది మొత్తం చూసుకుంటే ఒక్కో ఫార్మాట్లో భారత జట్టు ఒక్కోలా ప్రదర్శన చేసింది. ఒకసారి 2022లో టీమిండియా అన్ని ఫార్మాట్లలో ఎలా రాణించిందో చూస్తే..

టెస్టుల్లో ఫర్వాలేదు..

టెస్టుల్లో ఫర్వాలేదు..

టీమిండియా ఈ ఏడాదిలో కొద్దోగొప్పో ఫర్వాలేదనిపించిన ఫార్మాట్ టెస్టులే. ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ చేతిలో ఒక టెస్టు మ్యాచ్ ఓడిన భారత్.. ఆ తర్వాతా సౌతాఫ్రికా చేతిలో రెండు టెస్టు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకపై సిరీస్ వైట్ వాష్ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది.

ఈ ఏడాది మొత్తం ఏడు టెస్టు మ్యాచులు ఆడిన భారత జట్టు అందులో నాలుగు గెలిచింది. అయితే సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వంటి బలమైన జట్ల చేతిలో ఓడిపోవడం గమనార్హం. గెలిచిన టెస్టుల్లో భారత ప్రత్యర్థులు పసికూన జట్లు అయిన శ్రీలంక, బంగ్లాదేశ్.

వన్డేల్లో అంతంతమాత్రమే..

వన్డేల్లో అంతంతమాత్రమే..

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు బాగా అచ్చొచ్చిన ఫార్మాట్ 50 ఓవర్ల ఫార్మాటే. కానీ ఈ ఏడాది ఈ ఫార్మాట్లో కూడా భారత్ ఆశించింనంతగా రాణించలేదు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో భారత జట్టు మొత్తం 24 వన్డే మ్యాచులు ఆడింది. వీటిలో 14 మ్యాచుల్లో టీమిండియా విజయాలు నమోదు చేసింది. రెండు మ్యాచులు ఫలితం తేలలేదు. మిగిలిన ఎనిమిది మ్యాచుల్లో ఓటములు చవిచూసింది. ఏడాది చివర్లో న్యూజిల్యాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన వన్డే సిరీసుల్లో భారత్ ఓడిపోవడం కూడా ఈ ఏడాది భారత అభిమానులకు మింగుడు పడని విషయమే.

పొట్టి ఫార్మాట్‌లో పసికూనలపైనే..

పొట్టి ఫార్మాట్‌లో పసికూనలపైనే..

ఇక ఎగ్జయిటింగ్‌గా ఉండే టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు రికార్డు అంతంతమాత్రంగానే ఉండటం గమనార్హం. ఈ ఏడాదిలోనే ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ కూడా జరిగిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు మొత్తం 40 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడింది. వీటిలో వెస్టిండీస్‌తో ఆడిన 8 మ్యాచుల్లో ఏడింట భారత్ పైచేయి సాధించింది.

అదే సమయంలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లపై మాత్రం అంత గొప్ప రికార్డు సాధించలేదు. ఈ జట్లపై భారత్ విజయాల శాతం 50 శాతంగా ఉంది. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే 40 మ్యాచుల్లో భారత జట్టు 28 విజయాలు నమోదు చేసింది. సౌతాఫ్రికాతో జరగాల్సిన ఒక మ్యాచ్ ఫలితం లేలకపోగా.. న్యూజిల్యాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్ డీఎల్ఎస్ విధానంలో డ్రా అయింది.

Story first published: Tuesday, December 27, 2022, 17:23 [IST]
Other articles published on Dec 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+