T20 World Cup 2022: రాహుల్ నువ్వు ఇక మారవా.. మరోసారి నిరాశపరిచిన ఓపెనర్..

టీ20 వరల్డ్ కప్ కేఎల్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. పెర్త్ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ కేఎల్ రాహుల్ మళ్లీ నిరాశ పరిచాడు. 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. రాహుల్ క్రీజ్ లో ఉన్నంత సేపు అసౌకర్యంగా ఉన్నాడు. మొదటి ఓవర్ ఒక్క పరుగు కూడా చేయకుండా మెయిడిన్ చేశాడు. ఆ తర్వాత సిక్స్ కొట్టాడు. కేఎల్ రాహుల్ లుంగీ ఎంగిడి బౌలింగ్లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్ ఔట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. రాహుల్ ఏంటిది అని ప్రశ్నిస్తున్నారు.
కేఎల్ రాహుల్ పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ తప్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అతన్ని తుది జట్టు నుంచి తప్పించలేదు. కానీ అతను జట్ట యాజమాన్యం నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ తడబడుతోంది. రోహిత్, రాహుల్, కోహ్లీ, హుడా, పాండ్యా తక్కువ పరుగులకే ఔటయ్యారు. వీరందరి వికెట్లను ఎంగిడి తీయడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications