Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: లంక టార్గెట్ 145 పరుగులు.. 3 వికెట్లతో హసరంగ తీన్మార్..

In the match against Sri Lanka, Afghanistan batted first and scored 144 runs in t20 World Cup 2022

టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బ్రిస్బేన్ లో ఆఫ్ఘానిస్తాన్, శ్రీలంక మధ్య జరుగుతున్న సూపర్-12 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ ఓపెనర్ల లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ 24 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 28 పరుగులు చేశాడు.

ఉస్మాన్ ఘనీ

ఉస్మాన్ ఘనీ

మరో ఓపెనర్ ఉస్మాన్ ఘనీ 27 బంతుల్లో ఒక సిక్స్, 2 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. నజీబుల్లా జద్రాన్ 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లందరు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ మహ్మద్ నబీ 13 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ మూడు వికెట్లు వికెట్లు తీయగా.. లాహిర్ కుమార 2 వికెట్లు పడగొట్టాడు. కసున్ రజిత, ధనుంజయ డిసిల్వ ఒక్కో వికెట్ తీశారు.

శ్రీలంక

శ్రీలంక

గ్రూప్-1లో ఇప్పటికే ఈ జట్లు దాదాపు సెమీస్ కు వెళ్లే అవకాశాలను కోల్పోయాయి. గ్రూప్-1లో శ్రీలంక మూడు మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. రెండింటిలో ఓడిపోయింది. శ్రీలంక 2 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఆఫ్ఘానిస్తాన్ మూడు మ్యాచ్ ల్లో ఒక మ్యాచు లో ఓడిపోగా.. మిగతా రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో ఆ జట్టు 2 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.

ఇంగ్లాండ్

ఇంగ్లాండ్

గ్రూప్-1లో న్యూజిలాండ్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడు పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ తో పాటు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ లు గెలిచి.. ఆస్ట్రేలియా ఆఫ్ఘానిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఓడిపోతే నేరుగా సెమీస్ వెళ్తుంది.

Story first published: Tuesday, November 1, 2022, 11:29 [IST]
Other articles published on Nov 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+