డర్బన్‌లో సరికొత్త అధ్యాయం: వన్డే చరిత్రలో నాలుగోసారి, కోహ్లీ 3సార్లు
హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాకు కోహ్లీసేన షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా వరుస విజయాల పరంపరకు బ్రేక్ పడింది.
ఈ వన్డేకి ముందు వరకు దక్షిణాఫ్రికా సొంతగడ్డపై 17 వరుస విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (112 బంతుల్లో 120; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీని నమోదు చేశాడు.
అనంతరం 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 45.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (112) వన్డేల్లో 33వ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అయితే, సఫారీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్, భారత ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీలను నమోదు చేయడంతో వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒకే వన్డేలో సెంచరీలు చేసిన కెప్టెన్లుగా డుప్లెసిస్-కోహ్లీలు చరిత్ర సృష్టించారు. మొత్తంగా చూస్తే ఒకే వన్డేలో ఇరు జట్ల కెప్టెన్లు సెంచరీలు చేయడం వన్డేల్లో నాలుగోసారి.

మ్యాచ్-1:
2013లో ఇంగ్లాండ్-స్కాట్లాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్కాట్లాండ్ కెప్టెన్ విలియమ్ పోర్ట్ ఫీల్డ్‌లు సెంచరీలతో మెరిశారు. తద్వారా తొలిసారి ఒకే వన్డేలో సెంచరీలు సాధించిన కెప్టెన్లుగా వీరిద్దరూ చరిత్ర సృష్టించారు.

మ్యాచ్-2:
2014లో బంగ్లాదేశ్-భారత జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్పికర్ రహీమ్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీలు సెంచరీలు నమోదు చేశారు. దీంతో ఏడాది వ్యవధిలోనే ఒకే మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు సెంచరీలు సాధించిన ఘనతను వీరిద్దరూ సొంతం చేసుకున్నారు.

మ్యాచ్-3:
2014లో భారత్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ‍్యూస్‌లు సెంచరీలు నమోదు చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ సెంచరీలు సాధించారు.

మ్యాచ్-4:
డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరిగిన వన్డేలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్, టీమిండియా కెప్టెన్ కోహ్లీలు సెంచరీలతో రాణించారు. వన్డేల్లో డుప్లెసిస్‌కు ఇది తొమ్మిదో సెంచరీ కాగా, కోహ్లీకి 33వది కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. అయితే, ఈ నాలుగు సందర్బాల్లో మూడుసార్లు విరాట్ కోహ్లీ భాగస్వామ్యం కావడం ఇక్కడ విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications