ఆసియాకప్ ఫైనల్: చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్

హైదరాబాద్: యూఏఈ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ అరుదైన ఘనత సాధించాడు. శుక్రవారం ఆసియా కప్ ఫైనల్లో దూకుడుగా ఆడిన లిటన్ దాస్ కేవలం 87 బంతుల్లోనే సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియాకప్ ఫైనల్లో సెంచరీ బాదిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా లిటన్ దాస్ చరిత్ర సృష్టించాడు.
మరొక విశేషం ఏంటంటే లిటన్ దాస్‌కి వన్డేల్లో ఇది తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం లిటన్ దాస్‌నే వరించింది. ఈ మ్యాచ్‌లో 117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా ఆసియాకప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

జయసూర్య చేసిన 125 పరుగులే ఇప్పటివరకు ఫైనల్లో అత్యధికం
గతంలో శ్రీలంకకు చెందిన జయసూర్య చేసిన 125 పరుగులే ఇప్పటివరకు ఈ టోర్నీ పైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు. కరాచీ వేదికగా 2008లో భారత జట్టుతో జరిగిన ఆసియా కప్ టోర్నలో జయసూర్య ఈ ఘనత సాధించాడు. ఇక, మొత్తంగా ఆసియాకప్ ఫైనల్లో సెంచరీ బాదిన ఐదో క్రికెటర్‌గా లిటన్ దాస్ నిలిచాడు.

2000లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో
2000లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటపట్టు సెంచరీ(100) చేశాడు. ఆ తర్వాత 2008 ఫైనల్లో టీమిండియాపై సనత్ జయసూర్య (125), 2014 ఫైనల్లో మిర్పూర్ వేదికగా శ్రీలంకపై పాక్ క్రికెటర్ ఫవాద్ ఆలమ్ (114 నాటౌట్), అదే మ్యాచ్‌లో పాక్‌పై శ్రీలంక ఆటగాడు తిరిమన్నె (101)లు సెంచరీలు సాధించారు.

ఫైనల్లో బంగ్లాపై 3 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్ టైటిల్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీ సాధించగా సౌమ్య సర్కార్ (33), మెహదీ హసన్ (32) ఫర్వాలేదనిపించారు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ
భారత బౌలర్లలో కుల్దీప్‌కు మూడు, కేదార్ జాదవ్‌కు రెండు వికెట్లు దక్కగా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. భారత్ తరఫున ఒక్క బ్యాట్స్‌మన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. రోహిత్ శర్మ మరో (48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications