
63కు చేరిన టీమిండియా విజయాల సంఖ్య
దాంతో టీ20ల్లో టీమిండియా విజయాల సంఖ్య 63 కు చేరింది. ఫలితంగా ఒక అంతర్జాతీయ జట్టు 100 టీ20లు ఆడే సమయానికి అత్యధిక విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన రికార్డుని నెలకొల్పింది. టీమిండియా తర్వాత ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాలలో వరుసగా దక్షిణాఫ్రికా(59), పాకిస్తాన్ (59), ఆస్ట్రేలియా(53), శ్రీలంక (52), న్యూజిలాండ్(52), ఇంగ్లండ్(48) జట్లు ఉన్నాయి.

160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ధావన్-రోహిత్ శర్మ
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20ల్లో ఐర్లాండ్‌పై ఓ జట్టు నెలకొల్పిన అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. తర్వాత కెనడాకు చెందిన ఓపెనర్లు గుణశేఖర, బాగాయ్ నెలకొల్పిన 125 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానంలో ఉంది.

1000కిపైగా పరుగులు నమోదు చేసిన రెండవ ఓపెనింగ్ జోడీ
అదే సమయంలో ధావన్-రోహిత్ శర్మల జోడి మరో రికార్డుని కూడా నమోదు చేసింది. టీ20ల్లో 1000కిపైగా పరుగులు నమోదు చేసిన రెండవ ఓపెనింగ్ జోడీగా ధావన్-రోహిత్ శర్మల జోడీ నిలిచింది. టీ20ల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా డేవిడ్ వార్నర్-షేన్ వాట్సన్‌లు ఉన్నారు.

34 ఇన్నింగ్స్‌ల్లో 1103 పరుగులు చేసిన ధావన్-రోహిత్ జోడీ
ఈ జోడీ 32 ఇన్నింగ్స్‌ల్లో 1108 పరుగులు చేశారు. కాగా, ధావన్-రోహిత్ శర్మల జోడీ 34 ఇన్నింగ్స్‌ల్లో 1103 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. వీరి తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్టిల్-కేన్ విలియమ్సన్‌ల జోడీ 18 ఇన్నింగ్స్‌ల్లో 870 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications












