Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జహీర్ ఖాన్ కన్నా మిన్న: ఎవరీ భరత్ అరుణ్

హైదరాబాద్: భరత్ అరుణ్... ప్రస్తుతం భారత క్రికెట్‌లో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు. కారణం తాజాగా టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఎంపిక అవ్వడమే. ఇటీవలే టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి తన బృందంలో భరత్ అరుణ్ ఉండాలంటూ గట్టిగానే పట్టుబట్టాడు.

అంతేకాదు తన పంతం నెగ్గించుకుని భరత్ అరుణ్‌ని బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యేలా చేశాడు. అసలు అతని ప్రత్యేకత ఏమిటి? బీసీసీఐ జహీర్‌ ఖాన్‌ని వద్దని భరత్‌ను ఎంచుకోవడం సరైన నిర్ణయమేనా? అసలు ఎవరీ భరత్‌ అరుణ్‌ ఎవరు? ఇవన్నీ ప్రస్తుతం సగటు క్రికెట్‌ అభిమానిని వేధిస్తోన్న ప్రశ్నలు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన మొత్తం మ్యాచ్‌లు ఆరు

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన మొత్తం మ్యాచ్‌లు ఆరు

భరత్ అరుణ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన మొత్తం మ్యాచ్‌లు ఆరు (వన్డేలు-4, టెస్టులు-2). ఇక రెండు ఫార్మాట్లలో కలిసి అతను తీసిన వికెట్ల సంఖ్య 5 (టెస్టులు-4, వన్డే-1). 1986 డిసెంబరులో సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో భరత్‌ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.

కోచ్‌గా 15 ఏళ్ల నుంచి బాధ్యతలు

కోచ్‌గా 15 ఏళ్ల నుంచి బాధ్యతలు

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించికపోయినా... కోచ్‌గా 15 ఏళ్ల నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆ అనుభవమే ఇప్పుడు అతడిని కోచ్‌గా చేసిందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. అంతేకాదు గతంలో రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భరత్‌ బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు.

తమిళనాడుకు తొలిసారి కోచ్‌‌గా బాధ్యతలు

తమిళనాడుకు తొలిసారి కోచ్‌‌గా బాధ్యతలు

1962లో ఏపీలోని విజయవాడలో జన్మించిన భరత్‌ అరుణ్ 2002లో తమిళనాడులో తొలిసారి కోచ్‌ బాధ్యతలు అందుకున్నాడు. అతని హయాంలో తమిళనాడు వరుసగా రెండు సార్లు 2003, 2004లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత 2008లో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమితులయ్యారు.

ఎనిమిది సిరీస్‌లను కైవసం చేసుకున్న అండర్ 19 జట్టు

ఎనిమిది సిరీస్‌లను కైవసం చేసుకున్న అండర్ 19 జట్టు

ఆస్ట్రేలియాలో భారత్ ఏ జట్టు మూడు సిరీస్‌ల్లో విజయం సాధించడంలో భరత్ అరుణ్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత అండర్‌-19 జట్టుకి పూర్తి స్థాయిలో ప్రధాన కోచ్‌గా భరత్‌ ఎంపికయ్యాడు. అతని హయాంలో అండర్‌ 19 జట్టు వరుసగా ఎనిమిది సిరీస్‌లను కైవసం చేసుకుంది. అంతేకాదు 2012లో వరల్డ్ కప్‌ని కూడా గెలుచుకుంది.

రవిశాస్త్రికి అత్యంత సన్నిహితుడు

రవిశాస్త్రికి అత్యంత సన్నిహితుడు

ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రికి అత్యంత సన్నిహితుడు. జట్టులోని యువ ఆటగాళ్లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇండియన్ క్యాష్ రిచ్ టోర్నీ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకి 2014లో బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు.

అర్హతలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ కోచ్‌గా ఎంపిక

అర్హతలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ కోచ్‌గా ఎంపిక

ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకి సహాయ కోచ్‌గా ఉన్నాడు. భారత జట్టుకి కోచ్‌గా ఎంపికైన నేపథ్యంలో భరత్‌ అరుణ్ త్వరలోనే బెంగళూరు జట్టుకి రాజీనామా చేసే అవకాశం ఉంది. భరత్ అరుణ్ అర్హతలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అతడిని టీమిండియా బౌలింగ్ కోచ్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+