కేరళలో విషాదం: గుండెపోటుతో గ్రౌండ్‌లోనే మృతి చెందిన క్రికెటర్ (వీడియో)

హైదరాబాద్: కేరళలోని కసరగొడలో జరుగుతున్న ఓ టోర్నీలో ఈ విషాద ఘటన జరిగింది. ఓ క్రికెటర్ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతూ.. గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. వివరాల్లోకి వెళితే... పద్మనాభ అనే 20 ఏళ్ల క్రికెటర్ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతూ సడెన్‌గా కుప్పకూలాడు.
దీంతో వెంటనే అక్కడున్న అంపైర్లు, సహచర ఆటగాళ్లు అతనికి సాయం చేసే ప్రయత్నం చేశారు. అయితే అతను ఫీల్డ్‌లోనే ప్రాణాలు వదిలాడు. అయితే ఈ ఘటనపై మంజేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ సంఘటకు సంబంధించిన వీడియోని న్యూస్ 9 తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. 2015లోనూ ఇలాగే బెంగాల్ క్రికెటర్ అంకి కేష్రి మరో ఫీల్డర్‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయంతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఘటనలో మాత్రం 20 ఏళ్ల వయసున్న క్రికెటర్‌కి గుండెపోటు రావడం అక్కడున్న వారిని విషాదానికి గురి చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications