ఫోటోలు: న్యూ ఇయర్ వేడుకల్లో కెప్టెన్ కోహ్లీతో సహా పలువురు ఇలా!

హైదరాబాద్: కొత్త ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది సెలబ్రిటీలు ఘనంగా స్వాగతం పలికారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ నగర వీధుల్లో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోగా... జట్టులోని మిగతా క్రికెటర్లు తమదైన శైలిలో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.
ఇక, పుట్ బాలర్లు లియానల్ మెస్సీ, రొనాల్డోలు సైతం తమదైన స్టైల్‌లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వింధుకు భారత క్రికెట్ జట్టుతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్లు హాజరయ్యారు.

విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తమదైన స్టైల్‌లోనే వినూత్నంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. సిడ్నీ నగర వీధుల్లో విహరిస్తూ పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి... కొత్త ఏడాదిని స్వాగతించారు. ఇద్దరు కూడా మ్యాచింగ్ డిజైనర్ డ్రెస్‌ల్లో అలరించారు.

సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో కొత్త జంట పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్. ప్రస్తుతం ఈ ఇద్దరూ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో ఆడుతున్నారు.

యువరాజ్, కీచ్
టీమిండియా వెటనర్ క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హేజెల్ కీచ్ తమదైన శైలిలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న యువరాజ్ సింగ్, హేజిల్ కీచ్.

లియోనల్ మెస్సీ
తమ పిల్లలతో న్యూ ఇయర్ వేడుకల్లో మెస్సీ, యాంటోనెల్లా రొకుజ్జో. అర్జెంటీనాకు చెందిన లియోనల్ మెస్సీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా వెలుగొందుతున్నాడు.

క్రిస్టియానో రొనాల్డో
న్యూ ఇయర్ వేడుకల్లో తన ప్లేయసి జార్జీనా రొడ్రిగెస్‌తో కలిసి పాల్గొన్న పోర్చుగీస్ పుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానొ రొనాల్డో. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ స్ట్రైకర్లలో క్రిస్టియానో రొనాల్డో ఒకడు.

కృనాల్ పాండ్యా
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా తన భార్య ఫంఖూరితో కలిసి ఫోటోలకు పోజులిస్తోన్న భారత క్రికెటర్ కృనాల్ పాండ్యా

అనుష్కతో కలసి హాజరైన కోహ్లీ
న్యూ ఇయర్ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వింధుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సతీసమేతంగా హాజరయ్యాడు.

ఆసీస్ ప్రధాని నివాసంలో విందుకు
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌తో ఇండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లు. న్యూ ఇయర్ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వింధుకు హాజరైన టీమిండియా, ఆస్ట్రేలియా క్రికెటర్లు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications