రంగుల్లో మునిగారు: హోలీ వేడుకల్లో యువీ, ఆసీస్ ఆటగాళ్లు
హైదరాబాద్: హోలీ పండుగను పురస్కరించుకుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు బ్రెట్ లీ, మాథ్యూ హెడెన్‌లు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ టెస్టు సిరిస్‌కు బ్రెట్ లీ, హెడెన్‌లు కామెంటేటర్లగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న వీరిద్దరూ అభిమానులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చిమ్ముకుంటూ బ్రెట్ లీ, హెడెన్ అభిమానులతో కాసేపు సరదాగా గడిపారు. అనంతరం వారితో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
ఫ్యాన్స్‌కు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీ పండుగను ఎంతో బాగా జరుపుకున్నట్లు బ్రెట్ లీ తెలిపారు. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కూడా అభిమానులతో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా అభిమానులకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు.
ఇక టీమిండియా ఆటగాళ్లు యువరాజ్ సింగ్, భువనేశ్వర్, భజ్జీలు సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక సురైనా రైనా తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
హోలీ ఆడిన ఆసీస్ మాజీ క్రికెటర్లు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు బ్రెట్ లీ, మాథ్యూ హెడెన్‌లు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరిస్‌కు బ్రెట్ లీ, హెడెన్‌లు కామెంటేటర్లగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న వీరిద్దరూ అభిమానులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

అభిమానులతో కలిసి హోలీ ఆడిన ఆసీస్ మాజీ కెప్టెన్
భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరిస్‌కు కామెంటేటర్‌గా వ్యవహారిస్తోన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిమానులతో కలిసి హోలీ ఆడారు.

హోలీ ఆడిన యువరాజ్ సింగ్
టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం హోలీ ఆడారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

గీతాబస్రాతో హోలీ ఆడిన హర్భజన్ సింగ్
టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోమవారం తన భార్య, బాలీవుడ్ హీరోయిన గీతాబస్రాతో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

భువనేశ్వర్ కుమార్
టీమిండియా ఆటగాడు భువనేశ్వర్ కుమార్ హోలీ పండుగని పురస్కరించుకుని సోమవారం సందడి చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

హోలీ ఆడిన పేసర్ ఉమేశ్ యాదవ్
టీమిండియా ఆటగాడు ఉమేశ్ యాదవ్ సోమవారం హోలీ పండుగని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సురేశ్ రైనా
టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా సోమవారం హోలీ పండుగని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య, కుమారుడితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications