500వ టెస్ట్‌కి వర్షం అడ్డంకి: భారత్ 318, కివీస్ 152/1
కాన్పూర్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 500వ టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. రెండో రోజైన శుక్రవారం టీ విరామం అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఇంతలో స్టేడియంలో అనూహ్యంగా చిరుజల్లులు ప్రారంభమయ్యాయి.

వర్షం కారణంగా ఆటను నిలిపివేసిన అంఫైర్లు
దీంతో అంఫైర్లు ఆటను నిలిపివేశారు. దీంతో సిబ్బంది స్టేడియాన్ని కవర్లతో కప్పారు. వర్షం కురిసే సమయానికి న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టపోయి 152 పరుగులు చేసింది. శుక్రవారం భారత బౌలర్లు 47 ఓవర్లు మాత్రమే వేయగలిగారు. 291/9 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం బరిలోకి దిగిన టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకే ఆలౌట్ అయింది.

21పరుగులకే ఓపెనర్ గుప్తిల్ ఔట్
అనంతరం న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ 21 పరుగులకే పెవిలియన్ కు చేర్చిన భారత్ బౌలర్లు, అనంతరం న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. మరో ఓపెనర్ లాథమ్ 56 పరుగులు నాటౌట్, కెప్టెన్ విలియమ్సన్ 65 పరుగులతో అర్ధ సెంచరీలు చేసి స్కోరు బోర్డుని పరిగెత్తించారు.

ఒక వికెట్ నష్టానికి 152 పరుగులు చేసిన న్యూజిలాండ్
దీంతో రెండో రోజు వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులు వెనకబడి ఉంది. 291/9 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు జడేజా 42 పరుగులతో దూకుడుగా ఆడటంతో అలవోకగా 300 పరుగుల మైలురాయిని చేరుకుంది.

భారత్ తొలి ఇన్నింగ్స్ 318
అయితే జడేజాకు సహకారం అందించిన టెయిలెండర్ ఉమేశ్ యాదవ్ 9 పరుగులతో వికెట్ కాపాడుకుంటూ కొద్దిసేపు క్రీజులో నిలిచినా జట్టు స్కోరు 318 వద్ద వాగ్నర్ విసిరిన షార్ట్ బంతికి యాదవ్ పెవిలియన్‌కు చేరాడు. తొలిరోజు మురళీ విజయ్, చఠేశ్వర్ పుజారా అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్ ఓ దశలో మెరుగైనస్థితిలో నిలిచినా, మిడిలార్డర్ విఫలమవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications