సచిన్‌తో క్రికెట్, పిల్లలతో పుట్‌బాల్ (ఫోటోలు)
ముంబై: తాజ్ ప్యాలెస్ హోటల్‌లో 26/11 మృతులకు నివాళులు. ముంబై ఓవల్ మైదానంలో చారిటీ మ్యాచ్‌లో పిల్లలతో కలిసి క్రికెట్, మురికివాడల సందర్శన, 12వ శతాబ్దం నాటి బాణ్‌గంగా చెరువులో పూజలు, సాయంత్రం 200 మంది బిజినెస్ ప్రముఖులతో కలిసి విందు కార్యక్రమం.
సువిశాలమైన భారతదేశాన్ని రెండు వందల ఏళ్లు పరిపాలించిన బ్రిటన్ రాజవంశీ వారసుడు యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ భారత పర్యటన తొలిరోజు విశేషాలివి. భారత పర్యటనకు వచ్చిన విలియం దంపతులు ముందుగా 26/11 మృతులకు నివాళులర్పించారు.
అనంతరం ముంబైలోని ఓవల్ మైదానంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, వెంగ్ సర్కారుతో క్రికెట్ ఆడారు. ఆ తర్వాత అనాథ బాలలతో సమావేశమయ్యారు. ఫ్యాషన్ ఐకాన్‌గా పేరొందిన కేట్ ముంబై వచ్చినప్పుడు అలెగ్జాండర్ మెక్‌క్వీన్ డిజైన్ చేసిన డ్రస్ ధరించారు.
అయితే ఓవల్ మైదానంలో చారటీ మ్యాచ్‌కు మాత్రం భారతీయ డిజైనర్ అనితా డోంగ్రే రూపొందించిన ట్యూనిగ్ గౌన్ ధరించి వచ్చారు. సాధారణంగా ఆమెమెక్ క్వీన్, స్టెల్లా మెక్‌కార్టిని, ఎర్డెమ్ వంటి బ్రిటిష్ డిజైనర్స్ దుస్తులను మాత్రమే ఇష్టపడతారు. అలాంటిది ముంబైకి చెందిన ఓ భారతీయ డిజైనర్ రూపొందించిన గౌన్‌ను ధరించడం విశేషం.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ విలియం, కేట్ దంపతులను కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. యువరాజు విలియంకు క్రికెట్ గురించి తెలియడంతో పాటు ఆయన బ్యాటింగ్ చేయగలగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కాగా, రాజ దంపతుల గౌరవార్థం ఆదివారం రాత్రి ఇచ్చిన విందులో బాలీవుడ్, వ్యాపార, క్రీడా ప్రముఖులు అనేక మంది పాల్గొన్నారు.
తాజ్ ప్యాలెస్ హోటల్‌లో విందుకు షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్, శిల్పా శెట్టి, సోనమ్ కపూర్, సచిన్ టెండూల్కర్, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్ర, కుమార్ మంగళం బిర్లా హాజరయ్యారు.

భారత్‌లో విలియం దంపతులు
క్రికెట్ లెజెండ్ సచిన్‌తో క్రికెట్, పిల్లలతో పుట్‌బాల్

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications