In Pics: ఆర్సీబీకి ముంబై ఆపార్ట్‌మెంట్‌లో విరుష్క జోడీ డిన్నర్ పార్టీ

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఏమాత్రం కలిసిరాలేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓటమిపాలైం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అయితే, జట్టు ఓటముల్లో ఉన్నప్పటికీ... జట్టులోని ఆటగాళ్లు మాత్రం పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
విరుష్క జోడీ డిన్నర్ పార్టీ
తాజాగా, ఆర్సీబీ జట్టులోని ఆటగాళ్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి సతీమణి అనుష్క శర్మ డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు. టోర్నీలో భాగంగా ఏప్రిల్ 15(సోమవారం) ముంబైలోలోని వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఆటగాళ్లను ఇంటికి ఆహ్వానించిన విరుష్క జోడీ
ఈ మ్యాచ్ కోసం ముంబైకి చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆటగాళ్లను విరుష్క జోడీ ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న తమ ఇంటికి ఆహ్వానించి డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు. కోహ్లీ, అనుష్క శర్మలతో కలిసి దిగిన ఫొటోలను ఆర్సీబీ ఆటగాళ్లు యజువేంద్ర చాహల్, హిమ్మత్ సింగ్, దేవ్ పడిక్కల్, కుల్వంత్ కేజ్రోలియా, బర్మన్ తమ ఇనిస్టాగ్రామ్‌లలో పోస్టు చేశారు.
సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
డిన్నర్ అనంతరం జట్టులోని ఆటగాళ్లతో విరుష్క జోడీ ఫోటోలు దిగింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నీలో భాగంగా ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ని ఏప్రిల్ 19న కేకేఆర్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications