న్యూఢిల్లీ: భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్‌ని 'ఎంఎస్ ధోనీ: అన్ టోల్డ్ స్టోరీ'నిర్మాత క్యాష్ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలోను విడుదల చేయనున్నారు.
ఈ సినిమాను డబ్బింగ్ చేసి తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఐపీఎల్లో గత సీజన్లలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
దీంతో ఆయనకు తమిళనాడుతో పాటు దక్షిణాదిన మంచి క్రేజ్ ఉంది. దీంతో దక్షిణాది భాషలలోను విడుదల చేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగా తెలుగు, తమిళ భాషల్లో పోస్టర్లు విడుదల చేశారు. హిందీ ట్రయలర్ ఆగస్టు 11న విడుదలయింది.

మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గత సీజన్లలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది.
హిందీ ట్రయలర్ విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. దీంతో నిర్మాతలు తెలుగు, తమిళ భాషల్లోను డబ్బింగ్ చేసి ట్రయలర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో ధోనీగా నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ నటిస్తున్నారు.

ఈ సినిమా దర్శకులు నీరజ్ పాండే. ఫాక్స్ స్టార్ స్టూడియో, ఇన్స్‌స్పైర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
రాంచీ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ ఎలా ఎదిగాడనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా కోసం క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్నారు.

ఈ సినిమాలో భూమికా చావ్లా.. ధోనీ సోదరిగా నటిస్తోంది. అనుపమ్ ఖేర్ ధోనీ తండ్రిగ నటిస్తున్నారు. కియారా అద్వానీ ధోనీ సతీమణిగా నటిస్తున్నారు.
ఈ సినిమా దర్శకులు నీరజ్ పాండే. ఫాక్స్ స్టార్ స్టూడియో, ఇన్స్‌స్పైర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.