మా అబ్బాయి ఎయిర్‌ఫోర్స్‌లో చేరతాడట: సచిన్(పిక్చర్స్)
లక్నో:తన కొడుకు భారత వైమానిక దళంలో చేరేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నాడని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పాడు. అయితే, అతడు చేరతాడా? లేదా? అనే విషయం మాత్రం అప్పుడే మాత్రం చెప్పలేమన్నాడు.
వాయుసేన గౌరవ గ్రూప్ కెప్టెన్ అయిన సచిన్ టెండ్కూలర్ భారత వాయుసేన 83వ వార్షికోత్సవాలకు హాజరైయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో గల హిందోన్ ఏర్‌బేస్‌లో వాయుసేన వార్షికోత్సవాలు జరుగుతున్నాయి.
వైమానిక ప్రదర్శనలను వీక్షించిన సచిన్ తన సహా అధికారులతో కలిసి కలివిడిగా తిరిగారు. వారితో కలిసి ఫోటోలు దిగాడు. సచిన్ తోపాటు ఆయన సతీమణి అంజలి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. వాస్తవానికి తన కొడుకును కూడా ఇక్కడకు తీసుకొద్దామనుకున్నానని, అతడికి ఎయిర్ ఫోర్స్ అంటే చాలా ఇష్టమని అన్నాడు. కాగా, అర్జున్ వయస్సు ఇప్పుడు 16ఏళ్లు. సుఖోయ్ యుద్ధ విమానంలో వెళ్లాలని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా, అది ఇంతవరకు కుదరలేదని సచిన్ తెలిపాడు.
కాగా, సచిన్ తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. 'భారత వాయుసేన అంకితభావానికి గర్విస్తున్నాం. ప్రతి ఉద్యోగి పరిపూర్ణ హృదయంతో విధులు నిర్వర్తిస్తున్నారు. వారి త్యాగాలు, నిబద్ధత గురించి మనమంతా ఆలోచించాలి' పేర్కొన్నాడు.

సచిన్ టెండూల్కర్
భారత బ్యాటింగ్ దిగ్గజం, వాయుసేన గౌరవ గ్రూప్ కెప్టెన్ సచిన్ టెండ్కూలర్ భారత వాయుసేన 83వ వార్షికోత్సవాలకు హాజరైయ్యారు.

సచిన్ టెండూల్కర్
ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో గల హిందోన్ ఏర్‌బేస్‌లో వాయుసేన వార్షికోత్సవాలు జరుగుతున్నాయి.
సచిన్ టెండూల్కర్
వైమానిక ప్రదర్శనలను వీక్షించిన సచిన్ తన సహా అధికారులతో కలిసి కలివిడిగా తిరిగారు. వారితో కలిసి ఫోటోలు దిగాడు. సచిన్ తోపాటు ఆయన సతీమణి అంజలి కూడా హాజరయ్యారు.
సచిన్ టెండూల్కర్
ఈ సందర్భంగా ఆయన తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ‘భారత వాయుసేన అంకితభావానికి గర్విస్తున్నాం. ప్రతి ఉద్యోగి పరిపూర్ణ హృదయంతో విధులు నిర్వర్తిస్తున్నారు. వారి త్యాగాలు, నిబద్ధత గురించి మనమంతా ఆలోచించాలి' పేర్కొన్నాడు.

సచిన్ టెండూల్కర్
భారత బ్యాటింగ్ దిగ్గజం, వాయుసేన గౌరవ గ్రూప్ కెప్టెన్ సచిన్ టెండ్కూలర్ భారత వాయుసేన 83వ వార్షికోత్సవాలకు హాజరైయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications