హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీన చంఢీగడ్‌లో సిక్కు సంప్రదాయ ప్రకారం, డిసెంబర్ 2న గోవాలో హిందు సంప్రదాయ ప్రకారం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
యువీ, హాజెల్ కీచ్‌లు తమ పెళ్లి వేడుకలను సుమారు 10 రోజులు నిర్వహించేలా ముందుగానే ఓ ప్రణాళిక వేసుకున్నారు. ఇందులో భాగంగా పెళ్లికి ముందు ఛండీగడ్‌లో సంగీత్, మెహందీ ఫంక్షన్‌లను నిర్వహించారు. ఆ తర్వాత గోవాలో పెళ్లి అనంతరం ప్రత్యేకంగా అతిధులతో కలిసి డ్యాన్స్ చేశారు.

తాజాగా మంగళవారం సంగీత్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, హర్భజన్‌సింగ్, జహీర్ ఖాన్, శిఖర్ ధావన్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ విషయాన్ని యువీ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి అభిమానులకు తెలియజేశాడు.
హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, శిఖర్ ధావన్‌తో కొత్త పెళ్లికొడుకు యువరాజ్ సింగ్ కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా గడిపాడు. అలాగే భజ్జీ ట్విట్టర్ ద్వారా మరోసారి యువరాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ యువరాజ్ సంగీత్ వేడుకల్లో సరదాగా ఎంజాయ్ చేసినట్లు ట్విట్టర్‌లో ఫోటోలతో సహా ట్వీట్ చేశాడు.