టీమిండియా ట్రెక్కింగ్ ఫోటోలు: కోహ్లీ అలా, రహానే ఇలా
హైదరాబాద్: పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 333 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా సేదతీరేందుకు పర్వతారోహణను ఆశ్రయించింది. స్వదేశంలో అత్యంత చెత్త రికార్డుని నెలకొల్పిన భారత్, దాని వల్ల వచ్చిన ఒత్తిడిని తగ్గించుకునేందుకు నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు పర్వతారోహణ వెళ్లింది.

కోహ్లీ సేన ఇలా
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఒకీఫ్ స్పిన్ విజృంభణతో ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడంతో ఆటగాళ్లకు దొరికిన సమయాన్ని కోహ్లీ సేన ఇలా ఉపయోగించుకుంది. దీంతో పుణెకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిని ఘాట్‌లో వీరంతా కలిసి విహారయాత్రకు వెళ్లారు.

సతీమణి రాధికాతో రహానే
ఈ బృందంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రహానెతో పాటు అతని భార్య రాధికా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అభినవ్ ముకుంద్‌తో పాటు పలువురు క్రికెటర్లు ట్రెక్కింగ్‌ను ఆస్వాదించారు.

సోషల్ మీడియాలో ఫోటోలు
ఈ సందర్భంగా దిగిన కొన్ని సెల్ఫీలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ పర్వత ప్రాంతంపై ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చున్న ఫోటోని ట్వీట్ చేశాడు.
కోహ్లీ కామెంట్ ఇదే
‘గడుస్తున్న ప్రతిరోజూ ఒక అవకాశం. ఆశీర్వాదం. గొప్పగా ఉండాలి. ముందుకు సాగిపోవాలి' అని తన ట్విట్టర్‌లో కామెంట్ పెట్టాడు.

మార్చి 4 నుంచి బెంగుళూరులో రెండో టెస్టు
నాలుగు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బెంగళూరులో మార్చి 4 నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications