For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి వరకు ఉత్కంఠ: టైగా ముగిసిన హర్యానా Vs గుజరాత్ మ్యాచ్

ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం హర్యానా స్టీలెర్స్‌, గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగి 27-27తో టైగా ముగిసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం హర్యానా స్టీలెర్స్‌, గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగి 27-27తో టైగా ముగిసింది. చివరి 5 నిముషాలలో హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు 13 పాయింట్లు సాధించడంతో ఆట ముగిసే సమయానికి రెండు జట్లు సమంగా నిలిచాయి.

హర్యానా జట్టులో రైడర్లు సుర్జీత్ సింగ్ 6, వికాస్ ఖండోలా 7, సురీందర్ నదా 7 పాయింట్లతో రాణించగా.. గుజరాత్ జట్టులో మహేంద్ర కుమార్ 5 రైడింగ్ పాయింట్లు సాధించాడు. తొలిమ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్‌ను చిత్తు చేసిన ఉత్సాహంలో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు ఆరంభం నుంచే దూకుడుని ప్రదర్శించింది.

In nail biting match, Haryana Steelers and Gujarat Fortunegiants ends in a draw

తొలి రెండు నిమిషాల ఆటలో ఇరుజట్లు కూడా పాయింట్లు సాధించలేకపోయాయి. మూడో నిమిషంలో గుజరాత్ రెండు రైడింగ్ పాయింట్లతో ఆటలో ఊపు తీసుకువచ్చింది. అదే ఊపులో 4-0 పాయింట్లతో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఆరో నిమిషంలో ఖాతా తెరిచిన స్టీలర్స్ వరుసగా పాయింట్లు సాధించి గుజరాత్ ఆధిక్యాన్ని 4-5కు తగ్గించింది.

ఆ తర్వాత గుజరాత్‌ రైడర్లపై తమ ఢిపెండర్లు ఒత్తిడి తేవడంతో 13వ నిమిషంలో హర్యానా 8-8తో స్కోరు సమం చేసింది. రెండు నిమిషాల్లో మూడు పాయింట్లు సంపాదించిన గుజరాత్‌ తొలి అర్ధభాగం ముగిసేసరికి 11-8తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో సబ్‌స్టిట్యూట్‌గా దిగిన సుర్జీత్ సింగ్ రైడింగ్‌లో రెండు పాయింట్లు తేవడంతో స్టీలెర్స్ 10-11 స్కోరు చేసింది.

మ్యాచ్ 24వ నిమిషానికి 12-11తో హర్యానా ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. గుజరాత్ జట్టు కోర్టులో ముగ్గురే మిగిలారు. ఈ సమయంలో సూపర్ ట్యాకిల్ పాయింట్ సంపాదించిన గుజరాత్ 13-12 తో ఆధిక్యం అందుకుంది. కానీ 40 సెకన్లలోపు మూడు పాయింట్లు సాధించి, హర్యానా జట్టు పాయింట్ల దూరాన్ని 17-22కి తగ్గించింది.

22-15తో విజయంవైపు సాఫీగా సాగుతున్న గుజరాత్ జట్టుకు అనుకోని ప్రతిఘటన ఎదురైంది. 34వ నిమిషంలో వికాస్‌ ఖండోలా కళ్లు చెదిరే సూపర్‌ రైడ్‌తో గుజరాత్ ఆధిక్యం 22-20కు పడిపోయింది. ఆ తర్వాతి నిమిషంలో గుజరాత్‌ను ఆలౌట్‌ చేసిన హర్యానా 23-23తో స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి మ్యాచ్‌ హోరాహోరీగా సాగి చివరికి టైగా ముగిసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+