Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాకీలో పాక్‌పై భారత్ గెలుపు: సెహ్వాగ్ దెప్పిపొడుపు, అక్తర్ మన్నింపు

ఢిల్లీ: భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా సరదాగా దెప్పిపొడిచాడు. దానికి షోయబ్ అక్తర్ అంతే సరదాగా కౌంటర్ ఇచ్చాడు. ఇది నెట్లో హల్‌చల్ చేస్తోంది.

ఇటీవల ఐపీఎల్ ట్వంటీ 20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఇంటి దారి పట్టింది. తాజాగా, హాకీలో సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత్... పాకిస్తాన్ పైన 5-1 గోల్స్‌తో గెలిచింది.

ఈ నేపథ్యంలో సెహ్వాగ్ ఓ ట్వీట్ చేశాడు. 'సారీ షోయబ్ బాయ్. హాకీలో కూడా అవకాశం చేజారిపోయింది. పాక్‌ను భారత్ ఓడించింది' అని ట్వీట్ చేశాడు. హాకీలో కూడా మౌకా అంటూ పేర్కొన్నాడు.

In Jest, Sehwag Tells Shoaib: 'You Lost a Mauka in Hockey As Well'

దానికి అక్తర్.. 'నా సోదరుడు సెహ్వాగ్ ఏమన్నా అతనిని క్షమిస్తాను. ఎందుకంటే అతని హృదయం బంగారం. చెడుగా అతనెప్పుడూ మాట్లాడడు. జస్ట్ ఫన్నీ వ్యాఖ్యలు చేశాడు' అని బదులిచ్చాడు.

మౌకా అంటే తెలిసిన విషయమే. ప్రపంచ కప్ వచ్చిన ప్రతిసారీ ఓ పాకిస్థాన్ అభిమాని భారత్ పైన పాక్ గెలుస్తుందని సంబరాలు చేసుకుంటానంటూ టపాసుల పెట్టెతో టీవీ ముందు కూర్చుంటాడు. పాక్ ఓటమిపాలు కావడంతో నిరాశగా వాటిని మళ్లీ దాచేస్తాడు. ఈ యాడ్‌ను గుర్తు చేస్తూ.. పాకిస్థాన్ జట్టు ఓటమిని సెహ్వాగ్ ఎత్తిపొడిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+