ఐపీఎల్ 2018: ధోని ఖాతాలో మరో రికార్డు

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా చెన్నై విజయాల్లో అంబటి రాయుడు, జట్టు కెప్టెన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరున్న ధోని, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చెన్నై ఆడిన అనేక మ్యాచ్‌ల్లో చివరి వరకూ నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఇటీవల ఐపీఎల్‌లో ఓ జట్టుకు కెప్టెన్‌గా 150కి పైగా విజయాలందించిన ఏకైక కెప్టెన్‌గా అరుదైన ఘనతను సాధించాడు.

ధోని ఖాతాలో మరో రికార్డు
తాజాగా ధోని ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. అదేంటంటే ఐపీఎల్ 11వ సీజన్‌లో ఇప్పటి వరకూ చివరి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ధోనీ ఎనిమిది మ్యాచ్‌లాడి మొత్తం 286పరుగులు సాధించాడు. అయితే ఇందులో 169 పరుగులు చివరి ఐదు ఓవర్లలోనే సాధించడం విశేషం.

204 పరుగులు చేసిన మన్‌దీప్ సింగ్
ధోని తర్వాత స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు మన్‌దీప్ సింగ్ ఉన్నాడు. మన్‌దీప్ ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 204 పరుగులు సాధించాడు. ఇందులో 136 పరుగులు చివరి ఐదు ఓవర్లలోనే సాధించడం విశేషం.

మూడో స్థానంలో ఆండ్రూ రసెల్
ఆ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా 114 పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ ఆండ్రూ రసెల్ మూడో స్థానంలో నిలవగా, చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో (98 పరుగులు) నాలుగో స్థానంలో, కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ (93 పరుగులు) ఐదో స్థానంలో, ఢిల్లీ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (91 పరుగులు) ఆరో స్థానంలో నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications