Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పాక్‌కు షాకిచ్చిన హార్దిక్.. అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఫీట్

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్ లో కనిపించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాండ్యా అత్యుత్తమ ప్రదర్శన క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుందియ చాలా మంది అభిమానులు స్టాండ్స్ నుంచి హార్దిక్ ను ప్రోత్సహిస్తున్నారు. ఈ కీలక మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్ లో మరో ఫీట్ ను సాధించాడు. 200 అంతర్జాతీయ వికెట్లు తీసుకున్న బౌలర్ గా హార్దిక్ నిలిచాడు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరిగా నిలిచాడు.

India vs Pakistan Live స్కోరు కార్డు

మొత్తంగా హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు సాధించగా.. అందులో టీ-20 లలో 94 వికెట్లు, వన్డేలలో 89 వికెట్లు, టెస్టు మ్యాచ్ లలో 17 వికెట్లు తీశాడు. భారత్, పాక్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా దాయాది జట్టుకు షాకిచ్చాడు. పాక్ కీలక ఆటగాళ్లను తన బౌలింగ్ లో ఔట్ చేసి ఆ జట్టును కష్టాల్లోకి నెట్టేశాడు. హార్థిక్ తాను వేసిన 9వ ఓవర్ లో పాక్ ఓపెనర్ బాబర్ ఆజం నుం ఔట్ చేశాడు. అనంతరం అర్థ శతకం చేసి మంచి ఫామ్ లో ఉన్న ద్ షకీల్ ను పెవిలియన్ కు చేర్చాడు.

In India-Pakistan Match Hardilk Pandya Completed 200 Wickets in International Cricket

ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిచి సులభంగా సెమీస్ కు చేరుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచి రేసులో నిలవాలని పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Story first published: Sunday, February 23, 2025, 18:16 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+