అంతర్జాతీయ క్రికెట్‌లో వాళ్లిద్దరే టాప్ జోడీ

హైదరాబాద్: వరుసగా వైఫల్యాలు అందుకుంటున్నాడని రోహిత్‌పై చేస్తున్న విమర్శలకు బ్రేక్ పడింది. సఫారీ జట్టుతో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా చేసిన ఐదో వన్డేలో సెంచరీ పూర్తి చేసినందుకు గాను పొగడ్తలు మొదలైయ్యాయి. భారత మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ భారత ఓపెనర్ జోడీని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ ఓపెనింగ్ ద్వయం కొన్నేళ్లుగా భారత్‌కు ఎన్నో విజయాలు అందిస్తుందంటూ పేర్కొన్నాడు. వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకుని బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తే ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకుపుట్టాల్సిందే. స్టార్ జోడీపై భారత మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రపంచ క్రికెట్లో అత్యంత కఠినమైన ఓపెనింగ్ జోడీ రోహిత్-ధావన్‌లదేనని క్రిష్ అభిప్రాయపడ్డారు. ' సిరీస్ విజయం కోహ్లీసేనకు గొప్ప సానుకూలాంశం. రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో రాణించే ఆటగాళ్లలో రోహిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. అతడులో ఫామ్‌లో ఉండటం భారత్‌కు కీలకం' అని తెలియజేశాడు.
ఇంకా.. 'ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల్లో టీమిండియా గెలుపు అవకాశాలు అతనిపైనే ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. ధావన్, రోహిత్ ఇద్దరూ ఫామ్‌లో ఉంటే వరల్డ్ క్రికెట్లో అత్యంత కఠిన ఓపెనింగ్ జోడీ ఇదే అవుతుంది. వీరికి బౌలింగ్ చేయడం అంత సులువైన విషయం కాదు. విరాట్ ఈ లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌ను కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదని' క్రిష్ పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications