
హైదరాబాద్: స్వదేశంలో లంక చేతిలో టెస్టు సిరిస్‌ను చేజార్చుకున్నప్పటికీ... ఐదు వన్డేల సిరిస్‌ను మాత్రం సఫారీలు విజయంతో ఆరంభించారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ (114 బంతుల్లో 112 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 47 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో కుశాల్ మెండిస్ (60), ఒషాడ ఫెర్నాండో (49) మాత్రమే ఫరవాలేదనిపించారు.
సఫారీ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, లుంగి ఎంగిడి చెరో మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 38.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సఫారీలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ వికెట్‌ను కోల్పోయింది. అయితే, ఆ తర్వాత మరో ఓపెనర్ డి కాక్ (81)తో జత కట్టిన డుప్లెసిస్ రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించాడు.
ఆ తర్వాత వాన్‌డర్ డుసెన్ (32 నాటౌట్)తో మూడో వికెట్‌కు అజేయంగా 82 పరుగులు జోడించి డుుప్లెసెస్ దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరుగుతుంది.