Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఎంత ధైర్యం.. నా కాలునే విరగ్గొట్టబోతావా?' - రోహిత్ శర్మ (వీడియో వైరల్)

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇప్పటికే దుబాయ్ చేరుకున్న టీమిండియా నెట్స్ లో తీవ్ర సాధన చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్ లో ఓ లోకల్‌ బౌలర్‌ తన బంతులతో కెప్టెన్ రోహిత్ శర్మను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఏకంగా తన కాలునే సదరు బౌలర్ విరగ్గొట్టబోయాడని రోహితే స్వయంగా చెప్పాడు.

నా కాలునే విరగ్గొట్టబోతావా?..
నెట్స్‌లో రోహిత్ శర్మ అన్ని రకాల షాట్లు బాదుతూ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలోనే స్థానిక లోకల్‌ పాస్ట్‌ బౌలర్‌ అవాయిస్‌ అహ్మద్‌ పదునైన బంతులను రోహిత్‌పై సంధించాడు. ఇన్‌స్వింగింగ్‌ యార్కర్లు సంధిస్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో నెట్ సెషన్ పూర్తయ్యాక అతడిపై ప్రశంసలు కురిపించాడు రోహిత్ శర్మ. అతడు క్లాస్ బౌలర్ అని కొనియాడాడు. "అతడు క్లాస్ బౌలర్. నువ్వు నా కాలునే విరగ్గొట్టాలని చూస్తున్నావా. గొప్పగా బౌలింగ్ చేశావు. మీరంతా ఇక్కడ ట్రైనింగ్ లో మాకు సాయంగా ఉంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు." అని హిట్ మ్యాన్ కొనియాడాడు.

In champions trophy net practice Rohit praises awais ahmad says are You trying to break my leg

సెంచరీతో ఫామ్ లోకి..
గత కొంతకాలంగా ఫామ్‌ లో లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. రీసెంట్ గానే ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ బాది ఫామ్ లోకి వచ్చాడు. తనదైన శైలిలో షాట్లు బాదుతూ మునపటి ఫామ్ ను గుర్తు చేశాడు. కానీ మూడో వన్డేలో మళ్లీ నిరాశపరిచాడు. కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ ను.. ఈ నెల 20న దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తో పోటీ పడనుంది.

Story first published: Tuesday, February 18, 2025, 18:05 [IST]
Other articles published on Feb 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+