'ఆస్ట్రేలియాపై సాధించిన సెంచరీనే నా అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్'

హైదరాబాద్: టెస్టు క్రికెట్‌లో తాను చేసిన సరిదిద్దుకోడానికి 2019 బాగా ఉపయోగపడిందని, సుదీర్ఘ ఫార్మాట్ యొక్క సూక్ష్మ నైపుణ్యాలపై మంచి అవగాహన ఉందని పాకిస్థాన్ టీ20 కెప్టెన్ బాబర్ ఆజామ్ చెప్పాడు. అయితే, గత రెండేళ్లుగా టెస్ట్ క్రికెట్‌లో తాను సొంత అంచనాలకు అనుగుణంగా రాణించలేదని బాబర్ అజామ్ అన్నాడు.
పాక్ తరుపున ఆరు టెస్టులాడిన బాబర్ ఆజామ్ గతేడాది 68.44 సగటుతో 616 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, 20 వన్డేల్లో 60.66 సగటుతో మొత్తం 1,092 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 93.30గా నమోదైంది. ఇందులో మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఆట యొక్క సూక్ష్మ నైపుణ్యాలను
గతేడాది 10 టీ20లు ఆడిన బాబర్ ఆజామ్ 41.55 సగటుతో 374 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా, బాబర్ అజామ్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో "ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్‌లో నేను చేసిన తప్పులను మెరుగుపరుచుకున్నాను. ఇందులో కొన్నింటిని అధిగమించగలిగాను. ఫలితంగా పరుగులు చేయడంలో సహాయపడ్డాయి. మీరు ఎక్కువ ఫార్మాట్ ఆడుతున్నారో దానిని బట్టి ఆట యొక్క సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోగలగాలి" అని అన్నాడు.

దక్షిణాఫ్రికా జట్టుపై పరుగులు సాధించడంతో
దక్షిణాఫ్రికా జట్టుపై పరుగులు సాధించడంతో తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని బాబర్ అజామ్ చెప్పుకొచ్చాడు. "డేల్ స్టెయిన్‌ను ఎదుర్కొని దక్షిణాఫ్రికాలో పరుగులు సాధించడం ఎలాగో తెలుసుకున్న ఇన్నింగ్స్ నాకు చాలా ఆనందాన్ని ఇవ్వడంతో పాటు విశ్వాసం పెంచింది. 60, 70 పరుగులను 100లుగా ఎలా మార్చాలో కూడా నేను నేర్చుకున్నాను. ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించడంతో ఈ ఫార్మాట్‌లో భారీగా పరుగులు చేయగలనున్న నమ్మకాన్ని నాకిచ్చింది" అని బాబర్ అజామ్ చెప్పుకొచ్చాడు.

గతేడాది ఆస్ట్రేలియాపై సెంచరీ
ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియా పేస్ బౌలర్లను ఎదుర్కొని తాను చేసిన సెంచరీని టెస్టు ఫార్మాట్‌లో తన ఉత్తమ ఇన్నింగ్స్‌గా బాబర్ అజామ్ కొనియాడాడు. మూడు ఫార్మాట్లోనూ పాకిస్థాన్ తరుపున అత్యంత విజయవంతమైన బ్యాట్స్ మన్‌గా బాబర్ అజామ్ కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో టాప్-6లో చోటు దక్కించుకున్న ఏకైక పాక్ బ్యాట్స్ మన్ ఇతడే. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో ఆరో స్థానం, వన్డేల్లో మూడో స్థానం, టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications