Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను ఆడ‌టం మొద‌లెట్టిన‌ప్పుడు నువ్వింకా చంటోడివే.. పార్థివ్ ప‌టేల్

In 2004, Parthiv Patel Tried To Sledge Steve Waugh. But It Backfired Hilariously.

పార్థివ్ ప‌టేల్ చాలా అదృష్ట‌వంతుడు. తోటి క్రికెట‌ర్‌ను కామెంట్ చేసి చిన్న మంద‌లింపుతో త‌ప్పించుకున్నాడు. అది 2004... అప్పుడే కీపర్ గా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు పార్థివ్ పటేల్.. దాదాపు 18 ఏళ్ళ వయసు. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్. అప్పట్లో గంగూలీ సారథ్యంలో ఆస్ట్రేలియా, భారత జట్ల మ్యాచ్ అంటే స్లెడ్జింగ్‌కి ఒక స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది.

దాదాపు మ్యాచ్ చివ‌ర‌కు వచ్చింది అనే స‌మ‌యంలో పార్థివ్ ప‌టేల్‌ ''ఆడు.. ఆడు.. నీకిష్టమైన స్లాగ్ స్వీప్ షాట్‌తో ఈ రోజు నీ కథ ముగుస్తుంది. పెవిలియన్‌కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు'' అంటూ స్టీవ్ వాని కామెంట్ చేశాడు. ఒక్కసారిగా స్టీవ్ వా కి కోపం వ‌చ్చింది. త‌న‌ని తాను స‌ముదాయించుకుని పార్థివ్ కి తనదైన శైలిలో బదులిచ్చాడు.

'చోటూ .. చూడ్డానికి చాలా చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నావు. 18 ఏళ్ల క్రితం నేను క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు నువ్వింకా నేపీల్లోనే ఉండుంటావ్.. కాస్త నా వయసుకైనా గౌరవమివ్వు'అన్నాడు. ఆ మాట‌కు చిన్న‌బుచ్చ‌కున్న పార్థివ్ కళ్ళు తేలేశాడు. ఆ తర్వాత ఈ విష‌యం టీమిండియాలోని సీనియర్ ఆటగాళ్లకు తెలియడంతో పార్థివ్‌ని మందలించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 9, 2017, 17:23 [IST]
Other articles published on Dec 9, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+