Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

44 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌లు! (Video)

సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న 44 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ ఫీల్డింగ్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. యువక్రికెటర్లతో పోటాపోటీగా కళ్లుచెదిరే క్యాచ్‌లు అందుకుంటున్నాడు. బుధవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసాలు చేశాడు. రెండు స్టన్నింగ్ క్యాచ్‌లతో పాటు రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయిర్-2 (సెమీఫైనల్)కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 18.5 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (47; 40 బంతుల్లో) టాప్ స్కోరర్. అరంగేట్ర బౌలర్ సామ్ కుక్ (4/24) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో జోబర్గ్ సూపర్ కింగ్స్ 13.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు డుప్లూయ్ (68; 43 బంతుల్లో), ఫాఫ్ డుప్లెసిస్ (55*; 34 బంతుల్లో) అదరగొట్టారు.

Imran Tahir takes stunning catches at the age of 44 in SA20

అయితే పార్ల్ రాయల్స్ ఇన్నింగ్స్‌తో తాహిర్ రెండు మెరుపు క్యాచ్‌లు అందుకున్నాడు. సామ్ కుక్ బౌలింగ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన బ్యూరెన్ షాట్‌కు యత్నించాడు. అయితే గాల్లోకి లేచిన బంతిని వెనక్కి పరిగెత్తుతూ తాహిర్ డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. తాహిర్ క్యాచ్‌కు ప్రయత్నిస్తున్నప్పుడే కామెంటరీలో వ్యాఖ్యాతలు అంత సులువు క్యాచ్ కాదని పేర్కొన్నారు. కానీ తాహిర్ అద్భుతంగా క్యాచ్‌ను పట్టాడు.

కాసేపటికే మరో కళ్లుచెదిరే క్యాచ్‌ను తాహిర్ అందుకున్నాడు. బర్గర్ వేసిన బాల్‌ను డేన్ విలాస్ బౌండరీకి ట్రై చేశాడు. కానీ బౌండరీ లైన్‌లో పరిగెత్తుతూ డైవ్ చేసి క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. అనంతరం తన స్టైల్‌తో ఎవరికీ చిక్కకుండా పరిగెత్తుతూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా, గురువారం జరగనున్న సెమీస్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జోబర్గ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో శనివారం జరిగే ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పోటీపడుతుంది.

Story first published: Thursday, February 8, 2024, 10:52 [IST]
Other articles published on Feb 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+