For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీపీఎల్ 2020‌లో ఆడనున్న 'ఒకే ఒక్కడు' ఇమ్రాన్ తాహిర్‌!!

Imran Tahir Set To Be The Only South African Player To Participate In CPL 2020

కరాచీ: వెస్టిండీస్ గడ్డపై ప్రతి ఏడాది జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) పూర్తి షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు సీపీఎల్ జరగనుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే సీపీఎల్ 2020‌లో ఆడేందుకు ఒకే ఒక్క దక్షిణాఫ్రికా క్రికెటర్ వెస్టిండీస్ గడ్డపైకి వెళ్లనున్నాడు. అతడు మరెవరో కాదు దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌.

 తాహిర్‌ ఒక్కడే:

తాహిర్‌ ఒక్కడే:

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దక్షిణాఫ్రికాలో ప్రయాణ ఆంక్షల్ని ఆ దేశ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తుంది. ఆగస్టు తొలి వారం నాటికి సీపీఎల్‌లో ఆడనున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు విండీస్ గడ్డపై చేరుకోవడం కష్టంగా మారింది. అయితే దక్షిణాఫ్రికా జట్టుకి ఆడుతున్న పాకిస్థాన్ సంతతి క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్‌ మాత్రం సీపీఎల్ 2020 సీజన్‌లో ఆడబోతున్నట్లు ప్రకటించాడు. దానికి కారణం తాహిర్ ప్రస్తుతం పాక్‌లో ఉండటమే. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)‌లో ఆడేందుకు ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్ వెళ్లిన తాహిర్.. వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో అక్కడే ఉండిపోయాడు.

ఫ్రాంఛైజీ‌కి సమాచారం:

ఫ్రాంఛైజీ‌కి సమాచారం:

పాక్‌లో ఉన్న ఇమ్రాన్ తాహిర్ సీపీఎల్ 2020 కోసం ఆగస్టు 1 నాటికి కరీబియన్ గడ్డపై అడుగుపెట్టబోతున్నట్లు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంఛైజీ‌కి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో దక్షిణాఫ్రికాకి చెందిన దుస్సేన్, షంషీ, నోర్తేజ్, రిలీ రొసౌ, కొలిన్ ఇంగ్రామ్ తదితరులు సీపీఎల్‌లో 2020 సీజన్‌‌లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. టోర్నీలో ఆడటంపై ఈ సఫారీ క్రికెటర్లు ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

బయో సెక్యూర్ వాతావరణంలో:

బయో సెక్యూర్ వాతావరణంలో:

కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్​, టొబాగోలో ఈ సీపీఎల్ 2020 సీజన్ జరుగనుంది. వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది సీపీఎల్ జరగడంపై తొలుత సందిగ్ధత నెలకొనగా.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తాజాగా పూర్తి స్థాయి షెడ్యూల్‌ని విడుదల చేసింది. సీపీఎల్ లీగ్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు జరుగనున్నాయి. సీపీఎల్​లో ఆగస్టు 18న ట్రిన్​బాగో నైట్ రైడర్స్​, గుయానా ఆమెజాన్ వారియర్స్ మధ్య తొలి పోరు జరుగనుంది. 33 మ్యాచ్‌ల ఈ లీగ్‌ ఫైనల్ సెప్టెంబరు 10న జరగనుంది. వైరస్ కారణంగా కేవలం రెండు స్టేడియాల్లో మాత్రమే ఈ లీగ్‌ని నిర్వహిస్తామని విండీస్ బోర్డు స్పష్టం చేసింది.

 ఆగస్టు 1 నాటికి:

ఆగస్టు 1 నాటికి:

లీగ్‌లో ఆడే విదేశీ క్రికెటర్లందరూ ఆగస్టు 1 నాటికి అక్కడికి చేరుకోవాలని సీపీఎల్ యాజమాన్యం సూచించింది. సీపీఎల్ 2020 సీజన్‌ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించబోతుండటంతో.. టోర్నీకి ముందు ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల్ని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి.. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారే మ్యాచులు ఆడనున్నారు.

మరోసారి బ్రాడ్ విజృంభణ.. 129 పరుగులకే విండీస్ ఆలౌట్.. సిరీస్ ఇంగ్లండ్ సొంతం

Story first published: Wednesday, July 29, 2020, 13:31 [IST]
Other articles published on Jul 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+