న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫేర్‌వెల్ మ్యాచ్‌: వ‌న్డేల్లో ఇక ఆ స్పిన్ మాంత్రికుడు క‌నిపించ‌డు!

ICC Cricket World Cup 2019 : Imran Tahir Set For Emotional Exit To ODI || Oneindia Telugu
Imran Tahir set for emotional exit to ODI

మాంచెస్ట‌ర్‌: ద‌క్షిణాఫ్రికా లెగ్ స్పిన్న‌ర్ ఇమ్రాన్ తాహిర్ మెరుపులు ఇక వ‌న్డే మ్యాచ్‌ల‌ల్లో క‌నిపించ‌వు. వికెట్ తీసుకున్న వెంట‌నే ఆనందంతో గ్రౌండ్ అంతా చ‌క్క‌ర్లు కొట్టే ఈ వెట‌ర‌న్ బౌల‌ర్‌.. త‌న చివ‌రి వ‌న్డే మ్యాచ్‌ను ఆడ‌బోతున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా- శ‌నివారం మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జ‌రిగే మ్యాచ్‌.. ఇమ్రాన్ తాహిర్ కేరీర్‌లో చిట్ట‌చివ‌రిది. ఈ మ్యాచ్ అనంత‌రం వ‌న్డేలకు గుడ్‌బై చెప్ప‌బోతున్నాడు 40 సంవ‌త్స‌రాల తాహిర్‌.

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో తాను చివ‌రి వ‌న్డేను ఆడ‌బోతున్న‌ట్లు తాహిర్ ఇదివ‌రకే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. జ‌ట్టులో యువ ర‌క్తాన్ని నింపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అందుకే తాను వైదొల‌గుతున్న‌ట్లు పేర్కొన్నాడు. టెస్టు మ్యాచ్‌లు, టీ20ల్లో కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశాడు. 2011 ఫిబ్ర‌వ‌రిలో త‌న 32వ ఏట తాహిర్ ద‌క్షిణాఫ్రికా జాతీయ జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. అప్ప‌టి నుంచీ స్పిన్ విభాగానికి నేతృత్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టిదాకా 106 వ‌న్డేల‌ను ఆడాడు. ఓల్డ్ ట్రాఫొర్డ్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగే మ్యాచ్‌తో 107వ‌ది. 106 మ్యాచ్‌ల‌ల్లో తాహిర్ 172 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు.

ప్ర‌తిభ ఉన్నప్ప‌టికీ.. అన్ని వ‌న‌రులు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ.. కేవ‌లం అదృష్టం క‌లిసి రాక‌పోవ‌డం వ‌ల్లే ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో త‌న జ‌ట్టు ప్ర‌భావం చూప‌లేక‌పోయింద‌ని అన్నాడు. ఈ విష‌యం త‌న‌ను జీవితాంతం క‌లచి వేస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. మాంచెస్ట‌ర్‌లో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. తాను ఆడుతున్న చివ‌రి టోర్న‌మెంట్‌లో జ‌ట్టు ఆశించిన స్థాయిలో ఆడ‌లేక‌పోవ‌డం అత్యంత బాధాక‌ర‌మ‌ని చెప్పాడు. త‌మ నుంచి అభిమానులు, దేశ ప్ర‌జ‌లు చాలా గొప్ప క్రికెట్‌ను ఆశించార‌ని, వాటిని తాము ఎంత మాత్ర‌మూ అందుకోలేక‌పోయామ‌ని వాపోయాడు.

ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టు అతి కొద్ది కాలంలోనే ఈ ప‌రాభావం నుంచి ఒడ్డెక్కుతుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. పూర్వ వైభ‌వాన్ని సాధిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు. జ‌ట్టు ఆట‌తీరు గురించి తానేమీ చింతించ‌ట్లేద‌ని, అపార‌మైన క్రికెట్‌ను ఆడ‌గ‌ల యువ‌కులు జ‌ట్టుకు అందుబాటులో ఉన్నార‌ని తాహిర్ అన్నాడు. గెలుపోట‌ములు ఆట‌లో స‌హ‌జ‌మ‌ని, ఒక‌రు గెలిస్తే- మ‌రొక‌రు ఓడి తీరాల్సిందేని చెప్పాడు. ఆ ఓట‌మి అనేది ఎక్కువ సార్లు త‌మ జ‌ట్టును ఆశ్ర‌యించింద‌ని అన్నాడు.

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య చిట్ట‌చివ‌రి లీగ్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ఆరంభమౌతుంది. దీనితో ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో లీగ్ ద‌శ ముగిసిపోతుంది. ఈ నెల 9న మొద‌టి సెమీఫైన‌ల్‌, 11న రెండో సెమీస్ మ్యాచ్ జ‌రుగ‌నున్నాయి. 14వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ నిర్వ‌హిస్తారు.

Story first published: Friday, July 5, 2019, 16:28 [IST]
Other articles published on Jul 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X