
పాకిస్థాన్‌లో ఆడే అవకాశం రాలేదు
బుధవారం పాకిస్తాన్ దేశానికి చెందిన జియో సూపర్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ తాహిర్ మాట్లాడి ఆసక్తికర విషయాలు చెప్పాడు. లాహోర్‌లో తాను క్రికెట్ ఆడేవాడినని, అక్కడ ఆడటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పాడు. 'నా కెరీర్‌లో చాలా కాలం పాకిస్థాన్‌లోనే క్రికెట్ ఆడాను. కానీ ఆ దేశం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. దాంతో తీవ్ర నిరాశ చెందా. పాకిస్థాన్‌కు చెందిన నేను ఆ దేశం తరఫున ఒక్క అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడం బాధిస్తోంది' అని తాహిర్ తెలిపాడు.

ఆ క్రెడిట్ అంతా నా భార్యదే:
2005 వరకూ పాక్‌లోనే ఆడిన ఇమ్రాన్ తాహిర్.. అక్కడే అండర్-19, పాకిస్థాన్ ఏ జట్ల తరఫున కూడా ఆడాడు. తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం రాకపోవడం, ప్రేమ కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. భార్య సుమయ్య దిల్దార్ సపోర్ట్‌తోనే దక్షిణాఫ్రికా తరఫున క్రికెట్ ఆడగలిగా అని ఇమ్రాన్ తాహిర్ తెలిపాడు. 'ఆ సమయంలో పాకిస్థాన్‌ను వీడటం కష్టంగా అనిపించింది. దేవుడి దయ వల్ల కొంతకాలం తర్వాత దక్షిణాఫ్రికా తరఫున ఆడే అవకాశం దక్కింది. ఈ విషయంలో ఆ క్రెడిట్ అంతా నా భార్య సుమయ్య దిల్బార్‌కే దక్కుతుంది' అని తాహిర్ చెప్పుకొచ్చాడు.

2009లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపిక:
2005లో దక్షిణాఫ్రికా వెళ్లిన ఇమ్రాన్ తాహిర్ నాలుగేళ్ల తర్వాత 2009లో ఆ దేశ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. దశాబ్దం పాటు అక్కడే ఆడిన అతడు గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 41 ఏళ్ల తాహిర్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. తాహిర్ 20 టెస్టులు, 107 వన్డేలు, 38 టీ20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 57, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 173, పొట్టి క్రికెట్‌లో 63 వికెట్లు పడగొట్టాడు. 2011, 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో ఆడాడు.

తొలి చూపులోనే ప్రేమించాడు:
1998లో దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌నకు ఇమ్రాన్ తాహిర్ పాకిస్థాన్ జట్టు సభ్యుడిగా వెళ్ళాడు. తాహిర్ అక్కడ భారత సంతతికి చెందిన మోడల్ సుమయ్య దిల్దార్‌ను చూసి.. తొలి చూపులోనే ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే సుమయ్య దక్షిణాఫ్రికా నుంచి రాననడంతో.. 2006లో తాహిర్ పాక్‌ను వీడాల్సి వచ్చింది. పాక్ అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం రాకపోవడం కూడా మరో కారణం. అనంతరం సుమయ్యను పెళ్లి చేసుకుని.. నాలుగేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా పౌరసత్వం పొందాడు.
ఎన్నో ఏళ్లుగా మాతోనే ఉంటున్నాయి.. ఆ రెండు మాకెంతో ఇష్టం: కృనాల్


Click it and Unblock the Notifications












