ప్రేమ కోసం పాకిస్థాన్‌ను వదిలేసిన స్టార్ స్పిన్నర్.. టాలీవుడ్ రేంజ్ లవ్ స్టోరీ!
Imran Tahir Love Story: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన లెగ్ స్పిన్నర్లలో ఇమ్రాన్ తాహిర్ ఒకరు. వికెట్ తీసిన తర్వాత స్టేడియమంతా పరిగెడుతూ ఆయన చేసే సందడి అభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది. అయితే ఇమ్రాన్ తాహిర్ దక్షిణాఫ్రికా తరఫున ఆడినప్పటికీ.. ఆయన పుట్టి పెరిగింది మాత్రం పాకిస్థాన్‌లో. తన మనసు గెలుచుకున్న భారత సంతతి యువతి కోసం ఆయన పాకిస్థాన్ దేశాన్ని వదిలి వెళ్లడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ క్రికెట్ ప్రయాణం ఎంత అద్భుతమో, ఆయన ప్రేమకథ అంతకంటే సినిమాటిక్‌గా ఉంటుంది. కేవలం తన ప్రేమ కోసం ఒక దేశాన్ని వదిలి మరో దేశానికి వెళ్లి, అక్కడ ప్రపంచస్థాయి క్రికెటర్‌గా ఎదిగిన తాహిర్ స్ఫూర్తిదాయక గాథ ఇది.
సేల్స్‌మెన్ నుంచి క్రికెటర్ వరకు..
1979లో లాహోర్‌లో జన్మించిన ఇమ్రాన్ తాహిర్ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో 16 ఏళ్ల వయసులోనే ఒక షాపింగ్ మాల్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేశారు. అయినప్పటికీ క్రికెట్‌పై మక్కువతో కష్టపడి ప్రాక్టీస్ చేసి పాకిస్థాన్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. ఆ సమయంలోనే ఆయన జీవితం ఊహించని మలుపు తిరిగింది.

తొలి చూపులోనే ప్రేమ..
పాకిస్థాన్ అండర్-19 జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు ఇమ్రాన్ తాహిర్‌కు సుమయ్యా దిల్‌దార్ పరిచయమయ్యారు. సుమయ్యా భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా యువతి. ఆమెను చూడగానే తాహిర్ ప్రేమలో పడిపోయారు. ఆమె అప్పట్లో ఒక మోడల్‌గా ఉండేవారు. తాహిర్ పాకిస్థాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమెను మర్చిపోలేకపోయారు. ఆమెను కలిసేందుకు పదేపదే దక్షిణాఫ్రికా వెళ్లేవారు.
ప్రేమ కోసం దేశం త్యాగం..
వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఒక సమస్య ఎదురైంది. సుమయ్యా తన దేశాన్ని వదిలి రావడానికి ఇష్టపడలేదు. మరోవైపు తాహిర్ పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని కలలు కనేవారు. కానీ కెరీర్ కంటే తన ప్రేమ గొప్పదని భావించిన తాహిర్, 2006లో పాకిస్థాన్ వదిలి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. 2007లో సుమయ్యాను వివాహం చేసుకున్నారు.

లేడీ లక్: దక్షిణాఫ్రికా స్టార్‌గా..
పెళ్లయిన తర్వాత ఇమ్రాన్ తాహిర్ దశ తిరిగింది. 2011లో దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వన్డేల్లో 7 వికెట్లు తీసిన తొలి సౌతాఫ్రికా బౌలర్‌గా రికార్డు సృష్టించారు. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (39) తీసిన సౌతాఫ్రికా స్పిన్నర్‌గా నిలిచారు. తన కెరీర్‌లో 20 టెస్టుల్లో 57 వికెట్లు, 107 వన్డేల్లో 173 వికెట్లు, 38 టీ20ల్లో 63 వికెట్లు పడగొట్టారు.పాకిస్థాన్ బోర్డు గుర్తించని ఒక గొప్ప టాలెంట్‌ను దక్షిణాఫ్రికా ఒడిసిపట్టుకుంది. తాహిర్ విజయాల్లో తన భార్య సుమయ్యా ప్రోత్సాహం ఎంతో ఉందని ఆయన తరచుగా చెబుతుంటారు. ప్రస్తుతం వీరికి గిబ్రాన్ అనే కుమారుడు ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications