Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీఎస్‌ఎల్‌ చరిత్రలో మూడో హ్యాట్రిక్‌: పరుగు వ్యవధిలో 5 వికెట్లు (వీడియో)

 Imran Tahir delighted over maiden hat-trick in the subcontinent

హైదరాబాద్: అభిమానుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్నా... పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆటగాళ్లు మాత్రం తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా శనివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అద్భుత ప్రదర్శన చేయడంతో ప్రత్యర్ధి జట్టు కేవలం పరుగు వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోయింది.

శనివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌-ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గ్లాడియేటర్స్ తాహిర్ స్పిన్ దెబ్బకు 15.4 ఓవర్లలో 102 పరుగులు చేసి ఆలౌటైంది. 101 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయిన గ్లాడియేటర్స్‌.. మరో పరుగు మాత్రమే చేసి మిగతా వికెట్లను కోల్పోయింది.

దీంతో పరుగు వ్యవధిలో గ్లాడియేటర్స్ జట్టు ఐదు వికెట్లను కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. చివరి ఐదు వికెట్లలో మూడు డకౌట్లు ఉండటం గమనార్హం. ఇది పీఎస్‌ఎల్‌ చరిత్రలో మూడో హ్యాట్రిక్‌గా నమోదైంది. అనంతరం 103 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

లక్ష్య ఛేదనలో సంగక్కర 44 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 51 పరుగులు చేసి ముల్తాన్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇమ్రాన్ తాహిర్ హ్యాట్రిక్ తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Sunday, March 4, 2018, 14:55 [IST]
Other articles published on Mar 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+