ఇమ్రాన్ తాహిర్‌ని అవమానించిన పాక్ కాన్సులేట్ అధికారులు
హైదరాబాద్: బర్మింగ్‌హామ్‌లోని పాక్ హై కమిషనర్‌కు వీసా కోసం వెళ్లిన దక్షిణాఫ్రికా ప్రధాన స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్థాన్‌తో స్వదేశంలో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వరల్డ్ లెవన్ జట్టు తరుపున ఇమ్రాన్ తాహిర్ లాహోర్ వెళ్లాల్సి ఉంది.
ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 12, 13, 15 తేదీల్లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డు ప్లెసిస్ నాయకత్వం వహిస్తున్న ఈ వరల్డ్ లెవన్ టీమ్‌లో తాహిర్‌తో పాటు ఏడు టెస్టు దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.

ఈ మూడు టీ20ల టోర్నీకి సంబంధించి వీసా కోసం ఇమ్రాన్ తాహిర్ బర్మింగ్‌హామ్‌లోని పాక్ హై కమిషనర్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అక్కడి సిబ్బంది అతడి పట్ల కాస్తంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఐదు గంటల పాటు ఖాళీగా కూర్చోబెట్టారు. ఆ తర్వాత 'ఈరోజు టైమ్ అయిపోయింది.. ఆఫీస్ మూసేస్తున్నాం' అని అన్నారు.
దీంతో తనకు జరిగిన అవమానాన్ని ట్విట్టర్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అందులో తనతోపాటు తన కుటుంబాన్ని కూడా పాక్ హైకమిషన్ అవమానించిందని ఇమ్రాన్ తాహిర్ చెప్పాడు.
ఈ ఘటనపై పాక్ మంత్రి ఆషాన్ ఇక్బాల్ స్పందించారు. దీనిపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై విచారణ తీసుకుంటామని చెప్పిన ఆయన.. తాహిర్‌కు ట్విట్టర్‌లో క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications