ఇమ్రాన్ తాహిర్ అత్యుత్సాహం: నెటిజన్ల ఎగతాళి! (వీడియో)


హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ నవ్వులపాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో తాహిర్ కొంచెం అతిగా ప్రవర్తించడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో
ఈ మ్యాచ్‌లో కగిసో రబడా వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్ జోష్ ఫిలిప్ భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని డీప్‌ఫైన్ లెగ్ దిశగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇమ్రాన్ తాహీర్ ఎగిరి మరీ గంతేసి అందుకున్నాడు. దీంతో వెంటే గ్యాలరీలోని అభిమానులవైపు తిరిగి, తన టీషర్టుపై ఉన్న పేరును సూచిస్తూ సైగలు చేశాడు.
నో బాల్‌గా ప్రకటించిన అంఫైర్
ఆ తర్వాత ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఇమ్రాన్ తాహిర్ ఆనందం కాస్త ఆవిరైంది. అంపైర్ వైపు ఏ మాత్రం చూడకుండా తను చేసిన ఈ హడావుడికి తన మొహం చిన్నబోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ముందు అంపైర్‌ను చూడు
"ముందు అంపైర్‌ను చూడు, ఆ తర్వాత సెలబ్రెషన్స్ చేసుకుందువు కానీ" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ పూర్తయ్యే వరకు కామెంటేటర్లు ఈ ఘటనను ప్రస్తావిస్తూ నవ్వుకున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సఫారీలు ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 42 ఓవర్లలో 173 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్యాన్ని పీఎమ్ ఎలెవన్ జట్టు కేవలం 36.3 ఓవర్లలోనే 174/6తో అలవోకగా ఛేదించింది.
మూడు వన్డేల సిరిస్‌లో తొలి వన్డే ఆదివారం
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు మూడు వన్డేలతో పాటు ఏకైక టీ20 సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం పెర్త్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications