For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ భయంకరమైన వాతావరణంలో భారత్‌తో క్రికెట్ సిరీస్ అసాధ్యం: ఇమ్రాన్ ఖాన్

Imran Khan says Terrible Atmosphere to Play India-Pakistan Bilateral Series

కరాచీ: భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్‌పై పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రస్తుతం నెలకొన్న భయంకరమైన వాతావరణంలో రెండు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ సాధ్యం కాదన్నారు. ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత ప్రభుత్వం ఎప్పటికీ అనుమతి ఇవ్వదని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య చివరి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ 2012-13లో జరిగింది. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్‌లో పాకిస్తాన్ పర్యటించింది. అప్పటి నుండి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగలేదు.

భారత్‌తో సిరీస్ అసాధ్యం:

భారత్‌తో సిరీస్ అసాధ్యం:

సోమవారం స్కై స్పోర్ట్స్ డాక్యుమెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురువు, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ భారత్‌తో క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుత ఉద్రిక్త సంబంధాల దృష్ట్యా భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడటం భయంకరమైన వాతావరణం అని పేర్కొన్నారు. 'భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతానికి బాలేవు. అటువంటి పరిస్థితిలో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం వాతావరణం సరైనది కాదు. అలాంటి పరిస్థితిలో సిరీస్ ఆడటం భయపెట్టేదిగానే ఉంటుంది. ఈ ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత ప్రభుత్వం ఎప్పటికీ అనుమతి ఇవ్వదు' అని ఖాన్ చెప్పారు.

అప్పుడు వాతావరణం బాగుంది:

అప్పుడు వాతావరణం బాగుంది:

భారత్‌లో రెండు సిరీస్‌లు ఆడాను అని పాకిస్తాన్ ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. 'మొదట నేను 1979లో భారతదేశాన్ని సందర్శించాను. ఆ సమయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు సంబంధాలను మెరుగుపర్చడంలో నిమగ్నమయ్యాయి. ఆ సమయంలో వాతావరణం బాగుంది. క్రికెట్ కూడా గొప్ప వాతావరణం కలిగి ఉంది. ప్రేక్షకులు రెండు జట్లను బాగా ఉత్సాహపరిచారు. మైదానంలో సందడి చేశారు. మేము కూడా బాగా ఆస్వాదించాం' అని పాక్ ప్రధాని పేర్కొన్నారు. ఖాన్ పాక్ తరఫున 88 టెస్టులు, 175 వన్డేలు ఆడారు. టెస్టుల్లో ఆరు, వన్డేల్లో ఒక శతకం బాదారు.

చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నాం:

చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నాం:

'నా కెప్టెన్సీలో కూడా భారతదేశాన్ని సందర్శించాను. 1987లో వాతావరణం బాగా లేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కారణంగా, ప్రేక్షకుల ప్రవర్తన కూడా చెడుగా ఉంది. అప్పుడు మేము చాలా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది' అని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఇండియా-పాకిస్తాన్ సిరీస్‌ను యాషెస్ సిరీస్ కంటే పెద్దదిగా ఆయన అభివర్ణించారు. యాషెస్ సిరీస్ ముఖ్యం, కాని భారత్-పాకిస్తాన్ సిరీస్‌తో సరిపోలడం లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చాలా మంది పాక్ మాజీ క్రికెటర్లు కొంతకాలంగా భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ కోసం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ద్వైపాక్షిక వన్డే సిరీస్ నిర్వహించాలి:

ద్వైపాక్షిక వన్డే సిరీస్ నిర్వహించాలి:

కరోనా సంక్షోభ సమయంలో ఫండ్ రైజింగ్ కోసం తటస్థ వేదికగా భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ నిర్వహించాలని ఇటీవల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు. 'ఈ సంక్షోభ పరిస్థితుల్లో భారత్-పాక్ మధ్య మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నా. ఈ మ్యాచ్‌ల ఫలితాలపై ఇరుదేశాల ప్రజలు కలత చెందరు. కరోనా కారణంగా జరుగుతున్న మ్యాచ్‌లనుకొని.. ఇరు దేశాల అభిమానులు ఆటను ఆస్వాదిస్తారు. కోహ్లీ సెంచరీ చేసినా పాక్ ప్రజలు.. బాబర్ శతకం బాదినా భారతీయులు సంతోషిస్తారు. మైదానంలో ఏం జరిగినా ఇరు జట్లు విజేతలుగా నిలుస్తాయి' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, August 19, 2020, 9:36 [IST]
Other articles published on Aug 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+